P Narahari: UPSC నుంచి బ్లాక్ షీప్‌లను తొలగించండి.. స్మితా వ్యాఖ్యలపై మరో ఐఏఎస్ సెటైర్స్!

ఐఏఎస్ స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సివిల్స్ మెంటర్ బాలలతకు ఐఏఎస్ పి.నరహరి మద్ధతుగా నిలిచారు. బాలలత వ్యాఖ్యలను అంగీకరిస్తున్నట్లు చెప్పారు. UPSC నుంచి కొన్ని బ్లాక్ షీప్‌లను తొలగించి ఇలాంటివి పునరావృతం కాకుండా ఒక వ్యవస్థను రూపొందించాలని సూచించారు.

New Update
P Narahari: UPSC నుంచి బ్లాక్ షీప్‌లను తొలగించండి.. స్మితా వ్యాఖ్యలపై మరో ఐఏఎస్ సెటైర్స్!

P Narahari IAS: సివిల్స్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కోటాపై (Disability Quota) ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ (Smita Sabharwal) చేసిన ట్విట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రముఖులు, దివ్యాంగుల నుంచి స్మితపై పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కమ్రంలోనే సివిల్స్ మెంటర్ బాలలత (Bala Latha) దివ్యాంగుల గురించి మాట్లాడటానికి స్మిత సభర్వాల్ కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఫీల్డ్ లో పరిగెత్తుతూ స్మిత సభర్వాల్ ఎంతకాలం పనిచేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరో ఐఏఎస్ అధికారి పి. నరహరి.. బాలలతకు మద్ధతుగా నిలిచారు. బాలలత వ్యాఖ్యలను తాను ఏకీభవిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు గమనించండి..
ఈ మేరకు వ్యవస్థలోకి ప్రవేశించిన కొన్ని నల్ల గొర్రెల కారణంగా మొత్తం దివ్యాంగుల రిజర్వేషన్లను తొలగించడం సరైనది కాదన్నారు. బాలలత చేసిన వ్యాఖ్యలను నేను అంగీకరిస్తున్నాను. పౌర సేవల్లో వికలాంగులకు (పిడబ్ల్యుడి) రిజర్వేషన్లపై గౌరవనీయమైన భారత సర్వోన్నత న్యాయస్థానం పలు తీర్పులు ఇచ్చింది. రాజీవ్ కుమార్ గుప్తా & అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా & అదర్స్ గ్రూప్‌లు ఎ, బిలలో గుర్తించబడిన అన్ని పోస్టులకు పిడబ్ల్యుడిలకు 3% రిజర్వేషన్‌ను పొడిగించాలని 2016లో సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ 28, 2021న కేరళ రాష్ట్రం vs లీసమ్మ జోసెఫ్ కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) దివ్యాంగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ హక్కును కల్పిస్తుందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. #UPSC బ్లాక్ షీప్‌లను తొలగించి. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా ఉండేలా ఒక వ్యవస్థను కూడా రూపొందించాలి' అంటూ ఆసక్తికరంగా పోస్ట్ లో రాసుకొచ్చారు. ఇది వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: TG News: కేంద్రం ఇచ్చినా రూ.850 కోట్లు ఏం చేశారు.. ప్రభుత్వంపై హరీష్‌ రావు ఫైర్

#ias-smita-sabharwal #bala-latha #ias-p-narahari
Advertisment
Advertisment
తాజా కథనాలు