Rampachodavaram : అంగన్వాడీ కేంద్రంలో కుమార్తెను చేర్చిన ఐఏఎస్‌ అధికారి!

రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే కుమార్తె సృష్టి గనోరేను అంగన్వాడీ కేంద్రానికి స్వయంగా తీసుకుని వచ్చి చేర్చారు. తమ కుమార్తెను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

Rampachodavaram : అంగన్వాడీ కేంద్రంలో కుమార్తెను చేర్చిన ఐఏఎస్‌ అధికారి!
New Update

IAS Officer : అంగన్వాడీ కేంద్రాల పై ప్రజలకు నమ్మకం పెరిగేందుకు అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఐఏఎస్‌ అధికారి (IAS Officer) తమ కుమార్తెను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitarama Raju) రంపచోడవరం(Rampa Chodavaram) ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే తన మూడేళ్ల కుమార్తె సృష్టి గనోరేను స్థానిక ఎర్రంరెడ్డి నగరంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి స్వయంగా తీసుకుని వచ్చి చేర్చారు.

పది మందికి ఆదర్శంగా నిలిచేలా పీవో తన కుమార్తెను అంగన్వాడీ కేంద్రానికి(Anganwadi Center) పంపడం గురించి తెలిసిన పలువురు అధికారులు, స్థానిక నేతలు, కార్యకర్తలు అధికారిని ప్రశంసించారు. మరోవైపు ఏజెన్సీలో బాగా చదువుతున్న విద్యార్థులను గుర్తించి ఢిల్లీలో రిపబ్లిక్‌, స్వాతంత్య్ర దినోత్సవాలకు పంపిస్తామని ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే వివరించారు.

కొద్ది రోజుల క్రితం ఈ ఐటీడీఏకు చెందిన నలుగురు విద్యార్థులు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రధానిని కలిసి వచ్చారు. సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో వారిని సత్కరించారు. ఏపీ మొత్తం నుంచి 30 మందిని ఢీల్లీ వేడుకలకు పంపగా.. అందులో నలుగురు రంపచోడవం ప్రాంతానికే చెందిన వారు కావడం అభినందనీయమన్నారు.

Also read: దటీజ్ ఇండియన్ నేవీ.. సముద్రపు దొంగల నుంచి పాక్ నావికుల్ని కాపాడిన భారత్!

#andhra-pradesh #rampachodavaram #ias-officer #daughter #anganwadi-center
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe