Rohan: ఆమె మెసేజ్ నా జీవితాన్ని మార్చేసింది.. టెన్నిస్ స్టార్ బోపన్న కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ను దక్కించుకోవడంలో తన భార్య సపోర్ట్ మరవలేనిదని రోహన్ బోపన్న అన్నారు. 'నా భార్య సుప్రియా అనన్య చెప్పిన మాటలే నా జీవితాన్ని మార్చేశాయి. నా ప్రయాణం ముగిసిందని భావించినప్పుడు ఆమె నాకు అండగా నిలబడింది' అని తెలిపాడు. By srinivas 28 Jan 2024 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Tennies: 45 ఏళ్ల వయసులో అద్భుతమైన విజయం సాధించడంలో తన భార్య పాత్ర కూడా ఉందంటున్నాడు భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న(Rohan Bopanna). కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open)ను దక్కించుకున్న ఆయన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సతీమణి సుప్రియా అనన్య (Supriya ananya) బోపన్నపై ప్రశంసలు కురిపించాడు. Thank you very much😊💪🏽... https://t.co/YaSsT1oyJd — Rohan Bopanna (@rohanbopanna) January 28, 2024 ఆ మాటలే స్ఫూర్తి.. ఈ మేరకు తన సక్సెస్ రహస్యాలను బయటపెట్టిన ఆయన ఆమె చెప్పిన మాటల నుంచే స్ఫూర్తి పొందానని చెప్పాడు. ‘ఒక రోజు నా భార్య నాకు చాలా విషయాలు చెప్పింది. ఆమె చెప్పిన మాటలన్నీ నా జీవితాన్ని మార్చేశాయి. 'నీ అవకాశాల లిమిట్ మార్చుకున్నప్పుడు.. అన్నీ మారిపోతాయి. 25 ఏళ్లకు ఒకటి.. 30 ఏళ్లకు మరొకటి.. 40 ఏళ్లకు అనుకున్నది జరగాలని అనుకుంటుంటాం. నిలకడగా దాని గురించే చెబుతూ ఉంటే తప్పకుండా ఏదొక సమయంలో సాధిస్తాం. అది క్రీడలైనా.. జీవితానికైనా సరే వర్తిస్తుంది. వాటిని అవకాశాలుగా మార్చుకున్నప్పుడు పరిమితులు తొలిగిపోతాయి’ అని అనన్య నాకు చెప్పిన మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. నా వైఫు, కూతురు త్రిథ ఎంతో మద్దతుగా నిలిచారు' అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి : Allahabad : భర్త కూలీ అయినా భరణం చెల్లించాల్సిందే.. హైకోర్టు సంచలన తీర్పు ప్రయాణం ముగిసిందని భావించా.. అలాగే తన ఆట నుంచి నిష్క్రమిస్తానని కొన్నేళ్ల కింద ఆమెకు ఓ వీడియో మెసేజ్ పెట్టానని చెప్పాడు బోపన్న. ఎందుకంటే అప్పట్లో తాను మ్యాచ్‌లు గెలవలేకపోయానని, అయిదు నెలల్లో ఒక్క మ్యాచూ నెగ్గలేదని గుర్తు చేశాడు. ఈ క్రమంలోనే తన ప్రయాణం ముగిసిందని భావించానన్నాడు. కానీ పట్టుదలతో తనలో ఉన్నది ఇంకేదో ఆటలో కొనసాగేలా చేశాయని పేర్కొన్నాడు. Age is just a number 🙌 Congrats, @rohanbopanna! pic.twitter.com/KGLoXyRQOc — #AusOpen (@AustralianOpen) January 25, 2024 గర్వంగా ఉంది: సానియా మీర్జా ఇక బోపన్న విజయంపై స్పందించిన సానియా మీర్జా.. ‘ఈ వారం మొదట్లో రోహన్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌కు వస్తే.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుస్తాడని భావించాం. ఇప్పుడు ఆ ఘనత సాధించాడు. ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇండియన్‌గా ఎంత గర్వపడుతున్నామో.. అంతకంటే ఎక్కువగా ఓ ఫ్రెండ్‌గా గర్వపడుతున్నా’ అంటూ ప్రశంసలు కురిపించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ విజేతగా నిలిచిన రోహన్ బోపన్న - మాథ్యూ ఎబ్డెన్‌కు 7.30 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. #rohan-bopanna #supriya-ananya #australian-open మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి