DK Aruna: వాళ్లు నాకు పోటీనే కాదు.. మురికి కాలువలో ప్రజలు ఓట్లు వేస్తారా!?

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వంలో మహబూబూనగర్ ఎంపీగా తాను భారీ మోజార్టీతో గెలవబోతున్నట్లు ఆర్టీవీతో జోష్యం చెప్పారు. మిగతా అభ్యర్థులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

New Update
DK Aruna: వాళ్లు నాకు పోటీనే కాదు.. మురికి కాలువలో ప్రజలు ఓట్లు వేస్తారా!?

lok sabha: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మహబూబూనగర్ ఎంపీగా తాను భారీ మోజార్టీతో గెలవబోతున్నట్లు జోష్యం చెప్పారు. ఈ మేరకు ఆర్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు తనకు పోటీ కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గెలుపును ఎవరూ ఆపలేరు..
ఈ మేరకు డీకే అరుణ మాట్లాడుతూ మహబూబ్ నగర్ ప్రజలు తనకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తన గెలుపును ఎవరూ ఆపలేరని, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేస్తే మురికి కాలువలో వేసినట్లే అన్నారు. కాంగ్రెస్ అరిగిపోయిన ఆరోపణలు చేస్తోంది. అన్నీ పాతపాటలే. బీఆర్ఎస్, బీజేపీ ఒకటనేది ఫేక్ ప్రచారం. ఎన్నికల ముందే అదే చెప్పుకుని అధికారంలోకి వచ్చారు. మూడు నెలల్లో వారి పరిపాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమైంది. మోడీ గారే ప్రధానిగా ఉండాలి. బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజలు స్పష్టమైన వైఖరితో ఉన్నారని చెప్పారు.

ఇది కూడా చదవండి: Kejriwal Health: క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం.. 46కు పడిపోయిన షుగర్ లెవల్స్!

అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యం..
పేద ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యం. 2040 కల్లా దేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు మోడీగారు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. మహబూబ్ నగర్ సీటు కైవసం చేసుకుంటానని అన్నారు. దేశం కోసం, మోడీ కోసం ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. పాలమూరు పార్లమెంట్ అభివృద్ధికోసం అరుణకే ఓటేద్దామని ఫిక్స్ అయ్యారని. వంశీ చందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తనుకు కాంపిటీషన్ కాదన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే మురికి కాలువలో వేసినట్లే అని విమర్శలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి గెలుస్తామనే నమ్మకం లేదన్నారు. జితేందర్ రెడ్డి ప్రభావం తన గెలుపుపై ప్రభావం చూపదన్నారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత గురించి కూడా ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు