CM Candidate Janareddy: మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ అనుకుంటే తానే సీఎం(Janareddy) అవుతానని ప్రకటించారు. ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పిన ఆయన.. హైకమాండ్ అనుకుంటే సీఎం ను అవుతానని అన్నారు. మంగళవారం పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్(Congress) చెప్పింది గ్యారెంటీగా ఇచ్చే స్కీమ్‌లేనని అన్నారు. కేసీఆర్ ప్రకటించినవి ప్రజలను మోసం చేసే పథకాలు అని అన్నారు. ఇదే సమయంలో పొన్నాల లక్ష్మయ్య పార్టీని వీడటంపై జానారెడ్డి స్పందించారు. పొన్నాల పార్టీని వీడటం బాధాకరం అన్నారు. పొన్నాల లక్ష్మయ్యను పార్టీ అన్ని విధాలా గౌరవించిందన్నారు.
ఇదికూడా చదవండి: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా?
ఇక వామపక్షాలతో మైత్రి విషయంపై స్పందించిన జానారెడ్డి.. వామపక్షాల కోసం కొన్ని చోట్ల కాంగ్రెస్ త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తాం అనేదిది గోబెల్స్ ప్రచారం మాత్రమేనని అన్నారు. కరెంట్ విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడింది ఒకటయితే.. సీఎం కేసీఆర్ మరోలా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు జానారెడ్డి. డబ్బు మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ము ఉందా? అని బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు జానారెడ్డి.
ఇదికూడా చదవండి: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా