/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-59-1-jpg.webp)
Casting couch: సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీలో మరో దుమారం రేపింది. ఒకవైపు హీరోయిన్ గా రానిస్తూనే మరోవైపు విలన్ పాత్రల్లోనూ అదరగొడుతోంది. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ మూవీస్ తోనూ అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ క్రమంలోనే తాను నటించిన తాజా చిత్రం ‘శబరి’ మే 3న ప్రేక్షకుల ముదుకు రానుండగా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న నటి.. తాజా ఇంటర్వ్యూలో సంచలన విషయం బయటపెట్టింది.
View this post on Instagram
టీవీ ఛానెల్ యజామాని..
ఈ మేరకు వరలక్ష్మి మాట్లాడుతూ.. తాను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని చెప్పింది. స్టార్ హీరో కూతురినైనా తనకు లైంగిక వేధింపులు తప్పలేదని, పరిశ్రమలో అమ్మాయిలు రాణించడం చాలా కష్టంగా మారిందని తెలిపింది. ‘నాన్నకు ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి వచ్చాను. మొదట్లో స్ట్రగుల్ అయినప్పటికీ తర్వాత మంచిపేరు తెచ్చుకున్నా. అయితే తమిళనాడుకు చెందిన ఓ టీవీ ఛానెల్ యజామాని నన్ను కలిసి ఒక ప్రాజెక్టు ఉందని, తనతో కలిసి పనిచేయాలని కోరాడు. నేను ఓకే చెప్పాను. కాసేపటి తర్వాత మనం బయట కలుద్దాం అన్నాడు. నేను ఎందుకని ప్రశ్నించగా.. అలా మాట్లాడుకుందాం. మంచి రూమ్ బుక్ చేస్తాను’ అంటూ చాలా వంకరగా మాట్లాడడని చెప్పింది.
ఇది కూడా చదవండి: Thatikonda Rajaiah: కడియం కులంపై విచారణ జరపాలి.. తాటికొండ రాజయ్య గరం
అయితే ఈ సంఘటన తర్వాత హీరో కూతురు అయిన తననే ఇలా అడిగితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని అమ్మాయి పరిస్థితి ఏమిటి? ఆలోచించినట్లు నటి తెలిపింది. వెంటనే అతనిపై కేసు పెట్టానని, ఈ చేదు అనుభవం జరిగి 6 ఏళ్లు అవుతుందని వెల్లడించిది. ఇక శబరి సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఆమె పెళ్లి పీఠలెక్కనున్న సంగతి తెలిసింది.