Niharika:మెగా డాటర్ నీహారికా ఒక బాంబ్ అనే చెప్పాలి. మెగా కుటుంబం నుంచి వచ్చిన చిన్న సిసింద్రీ ఈమె. యాంకరింగ్‌తో టీవీ రంగంలోకి అడుగుపెట్టి అక్కడ నుంచి సినిమాల్లో హీరోయిన్గా ఎదిగి తరువాత నిర్మాతగా మారి ఇప్పుడు సీరీస్లు చేస్తూ బిజీగా గడిపేస్తోంది. నీహారికా ఎప్పుడూ కాళీగా ఉండదు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. దానికి తోడు ఆమె ఏం చేసినా అదో పెద్ద సెన్సేషనల్ న్యూస్ అవుతుంది కూడా. కెరీర్, పెళ్ళీ ఇలా అన్ని విషయాల్లోనూ ఆమె టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీనే అయింది. పెళ్ళయిన మూడేళ్ళకే విడాకులు తీసుకున్న నీహారికా తర్వాతమళ్లీ తన కెరీర్‌ను చక్కదిద్దుకునే పనిలో పడింది. ఒకపక్క సినిమాలు, సీరీస్లు చేస్తూనే ఆహా ఓటీటీలో ఓ కుకింగ్ షోకు యాంకరింగ్ చేస్తోంది. ఇందులో తాను వంట చేస్తూనే సెలబ్రిటీలతో కూడా వండిస్తూ బోలెడు కబుర్లు పంచుకుంటోంది.
నీహారికాకు ఈ మధ్య తిండి పిచ్చి బాగా ఎక్కువ అయిపోయిందట. దానివల్లే ఈ కుకింగ్ షో చేయడానికి ఒప్పుకున్నాని చెబుతోంది. అంతేకాదు పప్పుచారు కనిపిస్తే అస్సలు వదిలిపెట్టడం లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను చేస్తున్న చెఫ్ మంత్ర సీజన్-౩ కు నాన్నమ్మ, సురేఖ అమ్మ, ఉపాసన వదినను తీసుకురావాలని ఉందని అంది. దీంతో పాటూ ట్రావెలింగ్కు కూడా ఎక్కువ వెళుతున్నానని చెప్పుకొచ్చింది. ఏదీ కావాలని ప్లాన్ చేసుకుని వెళ్ళడం లేదని..ట్రావెల్‌కు అయ్యే ఖర్చులు తానే పెట్టుకుంటున్నాని అంటోంది.
ఇక సినిమాలు కెరీర్ విషయానికి వస్తే తనకు కమర్షియల్ సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టమని చెబుతోంది మెగా డాటర్. మంచి కమర్షియల్ సినిమాల్లో నటించాలని ఉంది..కానీ ఎవరూ తనకు అలాంటి పాత్రలను ఆఫర్ చేయడం లేదని వాపోయింది. అలాంటి పాత్ర వస్తే కనుక కచ్చితంగా వదులుకోనని తెలిపింది. తనకు ఆడిషన్స్‌కు వెళ్ళడం అంటే ఇష్టమని..కానీ పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకు ఆడిషన్ చేమరని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ ఎవరైనా డైరెక్టర్ మంచి సినిమాకు ఆడిషన్స్‌కు పిలిస్తే వెళ్తానని వివరించింది.