/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-19-5-jpg.webp)
Romantic Movies : యంగ్ బ్యూటీ, 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హిందీలోనూ రొమాంటిక్ మూవీస్(Romantic Movies) చేయాలనుందంటోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ(Tollywood Industry) లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఆమె ఇటీవలే నాని హీరోగా వచ్చిన 'హాయ్ నాన్నతో'(Hi Nanna) ప్రేక్షకులను అలరించింది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన బ్యూటీ.. తన భవిష్యత్తు లో చేయాలనుకుంటున్న మూవీస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
APPRECIATION TWEET ⭐
Big love to Mrunal Thakur for bringing Yashna to life❤️💙
Stellar performance!👏#HiNanna | @mrunal0801 pic.twitter.com/HUHuwvbdf9— Paddy (@itspaddyhere) December 9, 2023
అవకాశాలు రావడం లేదు..
ఈ మేరకు మృణాల్ మాట్లాడుతూ.. హిందీలో రొమాంటిక్ జానర్ చిత్రాల్లో నటించాలనే ఆసక్తి ఉందని చెప్పింది. ‘బాలీవుడ్(Bollywood) లో రొమాంటిక్ మూవీస్ చేయాలని ఉన్నప్పటికీ అవకాశాలు రావడం లేదు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. లవ్ స్టోరీల్లో నటించే పాపులారిటీ నాకింకా రాలేదని అనిపిస్తోంది. ఇప్పటివరకూ నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా వాటిల్లో రొమాంటిక్ స్టోరీలు మాత్రం లేవు. నాకు అలాంటి జానర్ మూవీస్ చేయాలనుంది. అలాంటివి నేను కూడా చేయగలను అని నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేసి చేసి విసుగేస్తుంది. ఇప్పటికే ఎంతోమందిని కలిసి అవకాశాలు అడిగా. కానీ ఎవరూ నమ్మకం కలిగించినట్లు అనిపించలేదు. ఇక అది సహజంగానే జరగిపోవాలని కోరుకుంటున్నా' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Reading this just fills my heart. 💖
Thank you for showering our film with so much love 🥰 https://t.co/yfhh99HQly— Mrunal Thakur (@mrunal0801) December 8, 2023
ఇది కూడా చదవండి : Deepika: బోల్డ్ క్యారెక్టర్ల కోసం తహతహలాడుతున్న దీపిక.. ఆ మూవీస్ కూడా చేస్తానంటోంది!
అలాగే తాను చిన్నప్పటి నుంచి బాలీవుడ్‌లో ఎన్నో ఉత్తమమైన ప్రేమకథా చిత్రాలు చూశానని చెప్పింది. ‘హాయ్ నాన్న’, ‘సీతారామం’(Sita Ramam) వంటి మనసుని హత్తుకునే సినిమాల్లో నటించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. చాలామంది క్వీన్ ఆఫ్ రొమాన్స్ అని పిలుస్తుంటే గర్వంగా అనిపిస్తుందంటూ మురిసిపోయింది.