బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’. ఈ మూవీ డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుండగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన మంత్రి మల్లారెడ్డి చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే తనదైన స్టైల్ లో మరోసారి జనాలను అలరించారు.
Also read :కౌంటింగ్‌కు ముందే పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లు తెరిచిన సిబ్బంది.. వీడియో వైరల్
ఈ వేడుకకు రణ్ బీర్, రష్మిక, హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే సినిమాను ఉద్దేశిస్తూ మాట్లాడిన మల్లారెడ్డి.. మహేష్ బాబు ‘బిజినెస్‌మేన్’ చూసి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఆ సినిమా ఏకంగా పదిసార్లు చూసి ఎంపీ అయ్యాను. సేమ్ మోడల్.. సేమ్ సిస్టమ్. రణ్‌బీర్ కపూర్ గారూ మీకొక విషయం చెప్పాలనుకుంటున్నా. వచ్చే ఐదేళ్లలో మొత్తం భారతదేశం, హాలీవుడ్, బాలీవుడ్‌ను మా తెలుగువాళ్లు రూల్ చేస్తారు. ఒక ఏడాది ఆగితే మీరు హైదరాబాద్‌కు మారిపోవడం బెటర్. ఎందుకంటే, ముంబయి పాతబడిపోతుంది.. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ ఎక్కువ.. అన్ని వసతులు కలిగిన ఏకైక నగరం హైదరాబాద్. తెలుగు వాళ్లు చాలా స్మార్ట్. మా దగ్గర రాజమౌళి, దిల్ రాజు, ఇప్పుడు సందీప్‌రెడ్డిఉన్నారు. మా హైదరాబాద్ టాప్‌లో ఉంటుంది. ‘పుష్ప’తో రష్మిక భారతదేశం మొత్తం తెలిసిపోయింది. మా మల్లారెడ్డి సంస్థల వేదికగా ఈవెంట్ జరుగుతోంది. మీ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. రూ.500 కోట్లకు పైగా వసూళ్లు చేయాలని కోరుకుంటామంటూ ఈవెంట్‌కు కొత్త ఉత్సాహాన్ని తెచ్చారు. మల్లారెడ్డి మాటలకు కథానాయకులు మహేశ్‌బాబు, రణ్‌బీర్‌కపూర్, దర్శకుడు రాజమౌళి చిరునవ్వులు చిందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండ్ అవుతోంది.
ఈ సినిమాలో బాబీదేవోల్ ప్రతినాయకుడిగా కనిపించనుండగా.. అనిల్‌కపూర్, శక్తికపూర్ కీలక పాత్రలు పోషించారు.