/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-04T141327.725-jpg.webp)
Big Billionaire : ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు రోజుకు రెండు పూటలు కూడా తినరు. వారు ఖాళీ కడుపుతో నిద్రపోతారు. ఆ బాధ ఎలా ఉంటుందో ఆకలి(Hungry) తో నిద్రపోయేవాడికే తెలుసని ఇన్ఫోసిస్(Infosys) వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి(N.R Narayana Murthy) అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత మిషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించారు.'ఆహార భద్రతలో విజయాలు : సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా భారతదేశం ప్రయత్నాలు' అనే థీమ్‌తో ఈ కార్యక్రమం జరిగింది. నా జీవితంలో కూడా ఒక సమయంలో ఆకలి విలువ తెలిసిందని ఆయన తెలిపారు. 50 ఏళ్ల క్రితం యూరప్‌లో పర్యటిస్తున్నప్పుడు 120 గంటల పాటు ఆకలి తో బాధపడ్డానని అన్నారు.
ఇది బల్గేరియా అప్పటి యుగోస్లేవియా నేటి సెర్బియా మధ్య సరిహద్దులో ఉన్న నిష్(Nish) అనే ప్రదేశంగురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న చాలా మంది భారతీయులు(Indians), నేను భారత ప్రభుత్వం నుండి మంచి నాణ్యమైన విద్యను పొందాము. కాబట్టి నాగరిక ప్రజలుగా మన దేశం పట్ల మన కృతజ్ఞతలు తెలియజేయాలి. పేద పిల్లల భవిష్యత్తు తరానికి మంచి విద్యను పొందేందుకు సహాయం చేయాలని ఆయన కోరారు.
నాలుగు బిలియన్ల భోజనాన్ని పురస్కరించుకుని భారతీయ NGO 'అక్షయ్ పాత్ర ఫౌండేషన్'(Akshay Patra Foundation) నిర్వహించిన కార్యక్రమంలో ఆహార భద్రత పోషకాహారంలో భారతదేశం వినూత్న వ్యూహాలు, విధానాలు విజయాలు SDGలతో వాటి అనుబంధాలు, ముఖ్యంగా 'జీరో హంగర్'(Zero Hunger) లక్ష్యం గా ఈ కార్యక్రమం జరిగింది. . ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తలు, అధికారులు, విద్యావేత్తలు, సామాజిక సంస్థలు మరియు భారతీయ సమాజ సభ్యులను ఇందులో పాల్గొన్నారు.
Also Read : కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ఈనెల 12కు వాయిదా