Thalasani:ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా జరిగిన సంఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. బైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేష్ బాబు (Bhainsa AMC Chairman Rajesh babu)తో పాటు గిరిజన సమాజానికి ఆయన క్షమాపణలు తెలిపారు. కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందని, ఓ వ్యక్తి నా కాలు తొక్కుతూ ముందుకెళ్లాడని.. దాంతో నా కాలుకు గాయమై రక్తమొచ్చిందన్నారు. ఆ సందర్భంగా నే ఆ వ్యక్తిని నెట్టి వేయాల్సి వచ్చిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
ఇక సోషల్ మీడియాలో దీన్ని పదే పదే ప్రచారం చేస్తూ తన పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అతను బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్ బాబు అని తెలిసిందని.. వెంటనే ఆ గిరిజన బిడ్డకు ఫోన్ చేసి సారీ చెప్పానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ సంఘటన పై క్లారిటీ ఇచ్చారు.
ఇక తాను బడుగు, బలహీన దళిత, మైనార్టీ గిరిజన వర్గాల గొంతుకనని అన్నారు తలసాని. తెలంగాణ లో జరిగేవ సేవాలాల్, కొమురం భీం జయంతి కార్యక్రమాలు ముందుండి చేస్తానన్నారు. ఆరోజు జరిగిన ఘటనపై వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే క్షమాపణ చెప్పుతున్నానని అన్నారు మంత్రి. ఇక బేషజాలకు పోవాల్సిన పరిస్థితికాదని.. గిరిజన సమాజానికి మరోసారి క్షమాపణలు చెబుతున్నానని ఆయన వీడియో రిలీజ్ చేశారు.
Also Read: వావ్…జాబిల్లిపై వడివడిగా అడుగులు వేస్తోన్న రోవర్, వీడియో వైరల్..!!