సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ఎవరికీ పెద్దగా పరిచయం అక్కర్లేదు. 90 దశకాల్లో అగ్రహీరోలందరి పక్కన నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి నటులందరితో నటించి మెప్పించింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేసింది.
గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తోంది. ఈ నటి ఎక్కువగా బాలీవుడ్ సినిమాలకే పరిమితం అయినట్లు కనిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో తన తెలుగు అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది.
ఈ క్రమంలోనే సిమ్రాన్ తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. బుధవారం సిమ్రాన్ వద్ద 25 సంవత్సరాలు మేనేజర్ గా పని చేసిన ఎం. కామరాజన్ అనే ఆయన అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ విషాద వార్తను సిమ్రాన్ తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.
ఆయన లేకుండా తన సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేనంటూ ఎంతో భావోద్వేగకరమైన పోస్ట్ పెట్టింది. '' ఈ విషాయాన్ని నేను నమ్మలేకపోతున్నా..ఇది నిజంగా దిగ్భ్రాంతికరమైన వార్త. నా ప్రియమైన స్నేహితుడు కామరాజన్ ఇక లేరు. 25 సంవత్సరాల నుంచి నా వెన్నంటే ఉండి..నా కుడి భుజంగా నిలిచారు. నా ఎదుగుదలకు ఆయన ఓ మూల స్తంభం లాగా నిలబడ్డారు.
ఆయన ఎల్లప్పుడూ కూడా చురుకుగా ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ అందరితోనూ ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేవారు. ఎంతో నమ్మకంగా పని చేసేవారు. ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. మీరు లేకుండా నా సినీ ప్రయాణాన్నిఊహించుకోలేను. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతాం. చాలా త్వరగా మమ్మల్ని వదిలి మీరు దూరంగా వెళ్లిపోయారు. మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి’ అని రాసుకొచ్చింది.
ప్రస్తుతం నటి పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కామరాజన్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
Also read: నటిగా నా ఆకలి తీర్చిన సినిమా అదే అంటున్న రష్మిక!