Shivam Dube: మహీ భాయ్‌ చెప్పాడు.. నేను ఫాలో అవుతున్నా: సిక్సర్ల దూబె

తన అధ్భుత ప్రదర్శనకు కారణం ధోని కారణమని శివమ్ దూబె చెప్పాడు. 'మహీ భాయ్‌ నాలో ప్రతిభను వెలికి తీశారు. స్వేచ్ఛగా ఆడటానికి అవసరమైన వాతావరణం సృష్టించారు. నాలో ఆత్మవిశ్వాసం నింపారు. ఈ క్రెడిట్ ఆయనదే' అన్నాడు. రోహిత్ కూడా భుజం తట్టి ప్రోత్సహిస్తున్నాడని చెప్పాడు.

Shivam Dube: మహీ భాయ్‌ చెప్పాడు.. నేను ఫాలో అవుతున్నా: సిక్సర్ల దూబె
New Update

Shivam Dube : అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న పొట్టి సిరీస్‌లో భారత ఆల్ రౌండర్ శివమ్ దూబె (Shivam Dube) దుమ్మురేపుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో సిక్సర్ల దూబెగా పేరొందిన శివమ్‌ ఈ సిరీస్ లో వరుసగా రెండు అర్ధశతకాలతో చెలరేగిపోగా.. టీ20 వరల్డ్ కప్ కు ముందు సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం తన ఆటతీరు గురించి మాట్లాడిన శివమ్.. తనలో ఉన్న ప్రతిభను వెలికితీసిన ఘనత ఎంఎస్‌ ధోనికి దక్కుతుందన్నాడు.

 మహీ భాయ్‌ వెలికి తీశారు..
ఈ మేరకు శివమ్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం నా ఆటతీరుకు కారణం సీఎస్‌కే జట్టు, మహీ భాయ్‌. నాలో ఉన్న ప్రతిభను వారే వెలికి తీశారు. స్వేచ్ఛగా ఆడటానికి అవసరమైన వాతావరణం సృష్టించారు. నాలో ఆత్మవిశ్వాసం నింపారు. ‘శివమ్‌ భయపడకు.. ఐపీఎల్‌లో అద్భుతంగా పరుగులు సాధించగలవు’ అని నిరంతరం నన్ను ప్రోత్సహించారు. అని చెప్పాడు. అలాగే మైక్‌ హస్సీ, ఫ్లెమింగ్‌ కూడా తనపై నమ్మకం ఉంచారని, ఇందుకు వారందరికీ థాంక్స్ చెప్పాడు.

రోహిత్ వెన్నుతట్టి ప్రోత్సహించాడు..
అలాగే ప్రస్తుతం టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా తనను వెన్నుతట్టి ప్రోత్సహించినట్లు వెల్లడించాడు. ‘టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ నా ఆటతీరుపై చాలా సంతోషంగా ఉన్నాడు. బాగా ఆడావు అని అభినందించాడు. జైస్వాల్‌, నేను స్ట్రోక్‌ ప్లేయర్లం. మా ఆటపై ఇద్దరికీ అవగాహన ఉంది. స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడం నా బాధ్యత. వీలైనంత వేగంగా బౌలర్లపై ఎదురు దాడి చేసి మ్యాచ్‌ను ముగించేయాలనే లక్ష్యంతో ఆడాం. టీ20లో రాణించాలంటే.. మానసికంగా చాలా బలంగా ఉండాలి. ఒత్తిడిని తట్టుకోవాలి. ఏ బౌలర్‌పై ఎదురు దాడి చేయాలో నిర్ణయించుకోవాలి’ అని దూబె చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి : Cricket: ఎమ్మెల్యే రికార్డ్ బ్రేక్ చేసిన సిరాజ్.. పోస్ట్ వైరల్

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 60*, 63* స్కోర్లతో రాణించాడు దూబె. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ రిటైర్‌మెంట్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన యువకుడు.. యువీ స్థానాన్ని రీప్లేస్ చేస్తాడంటున్నారు విశ్లేషకులు.

#ms-dhoni #shivam-dube
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe