Kannayya Naidu: మొన్న తుంగభద్ర, నేడు ప్రకాశం బ్యారేజ్ గేట్ల రిపేర్.. ఎవరీ కన్నయ్య నాయుడు?

ప్రస్తుతం నాగినేని కన్నయ్యనాయుడు పేరు మారుమోగిపోతోంది. కర్ణాటకలో తుంగభద్ర , ఇటీవల ప్రకాశం బ్యారేజ్‌ గేట్లను రిపేర్‌ చేసి ఈ డ్యామ్‌లను కాపాడటంలో ఈయనే కీలక పాత్ర పోషించారు. కన్నయ్యనాయుడి గురించి మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Kannayya Naidu: మొన్న తుంగభద్ర, నేడు ప్రకాశం బ్యారేజ్ గేట్ల రిపేర్.. ఎవరీ కన్నయ్య నాయుడు?

దేశవ్యాప్తంగా ప్రస్తుతం నాగినేని కన్నయ్యనాయుడు పేరు మారుమోగిపోతోంది. ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలు వచ్చినా ఈయన పేరే గుర్తుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కన్నయ్యనాయుడు కర్ణాటకలో ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలుపంచుకున్నారు. దేశంలో ఎదురైన ఎన్నో కఠినమైన సవాళ్లకు పరిష్కార మార్గాలు సూచించారు. 80 ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో యువ ఇంజనీర్లకు స్పూర్తినిస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో తుంగభద్ర డ్యాం 19 వ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో టీఎంసీల కొద్దీ నీళ్లు దిగువకు వృథాగా పోతున్న సమయంలో.. ఆ నీటికి అడుకట్ట వేయడంలో కనయ్య నాయుడే కీలక పాత్ర పోషించారు. వారం రోజుల్లో గేట్‌కు ప్రత్యామ్నాయంగా స్టాప్‌లాగ్‌ గేట్లను అమర్చి సమస్యకు తాత్కాలిక పరిష్కారాన్ని చూపించారు.

Also Read: ఉలిక్కిపడ్డ ఉత్తరాంధ్ర… పొంగిన వాగులు… నిలిచిన రాకపోకలు!

అంతేకాదు కర్ణాటకలో కీలకమైన నారాయణపూర్, సుఫా, హేమావతి, ఆలమట్టి, భద్రా డ్యామ్‌లతోపాటు తుంగభద్ర బ్యారేజీ నిర్మాణానికి కూడా కన్నయ్య నాయుడు టెక్నికల్‌గా సహాయ సహకారాలందించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, సోమశిల డ్యామ్ గేట్ల నిర్మాణంలోనూ, వాటి మరమ్మతుల్లోనూ ఈయన కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్ర, గోవా, గుజరాజ్,పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వివిధ ప్రాజెక్టుల్లో సమస్యలకు పరిష్కారాలు చూపించారు. ఇటవీల ఏపీలోని విజవాడను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రకాశం బ్యారేజ్‌కు బోట్‌లు కొట్టుకొచ్చి గేట్లను ఢీకొన్నాయి. దీంతో 67,69,70 గేట్లు డ్యామెజ్ అయ్యాయి. వీటిని కూడా మరమ్మతులు చేసే బాధ్యతను కన్నయ్య నాయుడే తీసుకున్నారు. ప్రస్తుతం కన్నయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్‌ జలవనరులు శాఖ సలహాదారుడిగా సేవలందిస్తున్నారు.

కన్నయ్య నాయుడు ఎవరు ?
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రాసానపల్లెలోని 1946లో ఓ రైతు కుటుంబంలో కన్నయ్యనాయుడు జన్మించారు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత తమిళనాడులోని సదరన్ స్ట్రక్చర్స్‌ కంపెనీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. అనంతరం హోసపేటే సమీపంలోని తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌లో చేరారు. ఈ క్రమంలోనే డిజైన్స్‌ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా అలాగే సీనియర్ మేనేజర్‌గా 2002 వరకు 26 ఏళ్ల పాటు పనిచేశారు.

Also Read: ఏపీలో హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం.. సీఎం చంద్రబాబు!

కన్నయ్యనాయుడు..చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రాసానపల్లెలో 1946లో ఓ రైతు కుటుంబంలో జన్మించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం... తమిళనాడులోని సదరన్ స్ట్రక్చర్స్ కంపెనీలో ఐదేళ్లు పనిచేసిన ఆయన.. హోసపేటే సమీపంలోని తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ లో చేరారు. ఈ క్రమంలో డిజైన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ గా, సీనియర్ మేనేజర్ గా 2002 వరకూ సుమారు 26 ఏళ్లపాటు పనిచేశారు. దేశవ్యాప్తంగా సుమారు 250 ప్రాజెక్టుల గేట్ల నిర్మాణంలో కన్నయ్య నాయుడు పాల్గొన్నారు. ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపించి తన సేవలందించాడు.

#Andhra Pradesh #telugu-news #kannayya-nayudu
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు