/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-5-10.jpg)
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. చట్టం అమల్లోకి రాగానే మొట్ట మొదటగా బుడమేరు ఆక్రమణలే తొలగిస్తామని చెప్పారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ఆదివారం వర్షాలు, వరదలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఆయన హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే కారణమని భావిస్తున్నట్లు చెప్పారు.