Janwada KTR Farm House: జన్వాడలోని కేటీఆర్ మిత్రుడికి చెందిన ఫాంహౌస్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఫామ్ హౌజ్ వద్దకు వెళ్లిన ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. దీంతో ఏ క్షణమైనా ఈ ఫాంహౌస్ పై బుల్డోజర్లు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ ఫాంహౌస్ నిబంధనలకు ఉల్లంఘించి నిర్మించారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సైతం ఈ ఫాంహౌస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కేటీఆర్ దేనని ఆయన స్పష్టం చేశారు.
KTR Farm House: కేటీఆర్ ఫాంహౌస్ లో అధికారుల కొలతలు.. ఏ క్షణమైనా కూల్చివేత!
కేసీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. దీంతో ఈ ఫామ్ హౌస్ కూల్చివేతకు ఏర్పాట్లు సాగుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. హైకోర్టు సైతం ఈ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వకపోవడంతో అధికారులు యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది.
Translate this News: