KTR Farm House: కేటీఆర్ ఫాంహౌస్ లో అధికారుల కొలతలు.. ఏ క్షణమైనా కూల్చివేత! కేసీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. దీంతో ఈ ఫామ్ హౌస్ కూల్చివేతకు ఏర్పాట్లు సాగుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. హైకోర్టు సైతం ఈ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వకపోవడంతో అధికారులు యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది. By Nikhil 27 Aug 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Janwada KTR Farm House: జన్వాడలోని కేటీఆర్ మిత్రుడికి చెందిన ఫాంహౌస్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఫామ్ హౌజ్ వద్దకు వెళ్లిన ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. దీంతో ఏ క్షణమైనా ఈ ఫాంహౌస్ పై బుల్డోజర్లు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ ఫాంహౌస్ నిబంధనలకు ఉల్లంఘించి నిర్మించారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సైతం ఈ ఫాంహౌస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కేటీఆర్ దేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఫాంహౌస్ పై డ్రోన్ ఎగురవేశాడని ఆ సమయంలో పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. అయితే.. ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు (Hydra Demolitions) ప్రారంభమైన నాటి నుంచి.. మళ్లీ జన్వాడ ఫాంహౌస్ అంశం తెరపైకి వచ్చింది. అయితే.. ఆ ఫాంహౌస్ తనదేనని, దాన్ని కూల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు మాత్రం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ ఫాంహౌస్ కు సంబంధించి అన్న పత్రాలను పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని హైడ్రాకు సూచించింది. కేటీఆర్ సైతం ఈ ఫాంహౌస్ పై స్పందించారు. తనకు ఎక్కడా ఫాంహౌస్ లేదని స్పష్టం చేవారు. అది తన మిత్రుడి ఫాంహౌస్ అని.. తాను కొన్నేళ్లు దాన్ని లీజుకు తీసుకున్నానని తెలిపాడు. ఒక వేళ దానిని నిబంధనలు పాటించకుండా నిర్మించినట్లు తేలితే తానే దగ్గర ఉండి కూల్చడానికి సిద్ధమన్నారు. అయితే.. కాంగ్రెస్ నేతలు, మంత్రులకు సంబంధించిన ఫాంహౌస్ లను కూడా పరిశీలించాలన్నారు. Also Read: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన! #ktr #telangana-news #cm-revanth-reddy #hydra-ranganath #hydra-demolitions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి