Hydra Demolishing : అక్రమ కట్టడాలపై హైడ్రా (Hydra) ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఆక్రమణలపై వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ (Google Maps), గూగుల్ ఎర్త్ (Google Earth) తరహా శాటిలైట్ ఫోటోలను జత చేసి బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. వారి ఫిర్యాదుల మేరకు హైడ్రా ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో ఉన్న 158 అక్రమ నిర్మాణాలను తొలగించింది. 43.94 ఎకరాల చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడింది.
Also Read: కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. సీఎం ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలోనే తమ ఊరు చెరువు కనబడటం లేదని బీజేపీ (BJP) నేత అందెల శ్రీరాములు పహాడ్ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేశ్వరంలోని తుమ్మల చెరువును కబ్జా చేశారని..8 ఎకరాల చెరువును రాత్రికి రాత్రే మాయం చేశారని అధికారులకు కంప్లైంట్ చేశారు. మాజీ మంత్రి సబితా అండతో కొందరు విచ్చలవిడిగా కబ్జాలు చేశారని బీజేపీ నేత ఆరోపించారు. హైడ్రాను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని.. సామాన్యులను ఇబ్బంది పెడితే ఊరుకోమని అందెల శ్రీరాములు హెచ్చరించారు.