Hyderabad : అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి!

హైదరాబాద్‌ కాటేదాన్‌ కు చెందిన ఓ యువకుడు అమెరికాలోని చికాగోలో మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన అక్షిత్‌రెడ్డి (26) ఉన్నత చదువుల కోసం 3 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాడు. గత శనివారం స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన అక్షిత్‌ నీట మునిగి చనిపోయాడు.

New Update
Hyderabad : అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి!

Hyderabad Youth Dies In USA : హైదరాబాద్‌ (Hyderabad) కాటేదాన్‌ కు చెందిన ఓ యువకుడు అమెరికా (America) లోని చికాగోలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటన 21 వ తేదీనే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుని మృతదేహం 27 వ తేదీ నగరానికి చేరుకోవడంతో ఆదివారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన గోపాల్ రెడ్డి, సమంత దంపతులు సుమారు 25 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని కాటేదాన్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. వారికి ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు కాగా కుమారుడు అక్షిత్‌రెడ్డిని (26) ఉన్నత చదువుల కోసం 3 సంవత్సరాల క్రితం అమెరికా పంపించారు. షికాగోలో ఎమ్మెస్ పూర్తి చేసిన అక్షిత్‌ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌ లో తల్లిదండ్రులు అక్షిత్‌ కు పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, గత శనివారం అక్షిత్‌రెడ్డి తన ఇద్దరు స్నేహితులతో కలిసి లేక్‌ మిశిగన్‌‌లో సరదాగా ఈతకు వెళ్లాడు. ఒకరు ఒడ్డునే ఉండిపోగా మిగతా ఇద్దరూ నీటిలోకి దిగి చెరువు మధ్యలో ఉన్న రాయి వరకూ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చే క్రమంలో అక్షిత్‌రెడ్డి అలసిపోయి నీట ముగిపోయాడు. అతడి స్నేహితుడు కూడా నీట మునిగిపోగా స్థానికులు కాపాడారు. ఈ క్రమంలో పోలీసులు అక్షిత్‌రెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు. శనివారం అతడి మృతదేహం హైదరాబాద్‌కు చేరుకోగా ఆదివారం అడ్డాకులలో అంత్యక్రియలు నిర్వహించారు.

Also read: ఒలింపిక్స్ లో భారత రోవర్‌ బల్‌రాజ్‌ సంచలనం!


Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు