Olympics 2024 : ఒలింపిక్స్ లో భారత రోవర్ బల్‌రాజ్ సంచలనం! ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ 2024 లో ఆదివారం జరిగిన రోయింగ్ పోటీల్లో భారత ఆటగాడు బల్‌రాజ్ పన్వార్ రికార్డు క్రియేట్ చేశాడు. పురుషుల సింగిల్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్ రౌండ్‌లోకి బల్ రాజ్ దూసుకెళ్లాడు By Bhavana 29 Jul 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Indian Rower Balraj Panwar Reaches Men's Singles : ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) లో ఆదివారం జరిగిన రోయింగ్ పోటీల్లో భారత ఆటగాడు బల్‌రాజ్ పన్వార్ (Balraj Panwar) రికార్డు క్రియేట్ చేశాడు. పురుషుల సింగిల్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్ రౌండ్‌లోకి బల్ రాజ్ దూసుకెళ్లాడు. వైరెస్-సుర్-మార్నే నాటికల్ స్టేడియంలో పోటీపడుతున్న భారత రోవర్ 7:12.41 టైమింగ్ తో మొనాకోకు చెందిన క్వెంటిన్ ఆంటోగ్నెల్లి (7:10.00) వెనుకబడి రెపెచేజ్ 2 రేసులో రెండో స్థానంలో నిలిచి సత్తా చాటాడు. ప్రతి మూడు రెపెచేజ్ రేసుల్లో అత్యంత వేగవంతమైన ఇద్దరు క్వార్టర్-ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఒక్కో రేసులో ఐదుగురు రోవర్లు పోటీపడ్డారు. బల్‌రాజ్ రేసును దూకుడుగా ప్రారంభించాడు. 1000 మీటర్ల మార్క్ వద్ద ఆంటోగ్నెల్లిని 0.01 సెకనుల వెనుకంజలో ఉంచాడు. ఏది ఏమైనప్పటికీ, మొనెగాస్క్ రోవర్ 1500మీ మార్కు వద్ద సెకను కంటే ఎక్కువ టైమ్ గ్యాప్ నే క్రియేట్ చేశాడు. చివరి థర్డ్ రన్ లో మొదటి స్థానంలో నిలిచాడు. పురుషుల సింగిల్స్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్ మంగళవారం జరగనున్నాయి. కాగా, ఏప్రిల్‌లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా (Republic Of Korea) లోని చుంగ్జులో జరిగిన ఆసియన్, ఓషియానియన్ రోయింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ రెగట్టాలో కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో ఇండియన్ ఆర్మీ మ్యాన్ పారిస్ 2024 బృందంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. Also read: భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి! #2024-paris-olympics #republic-of-korea #balraj-panwar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి