Mohammed Siraj: నెంబర్‌ వన్‌లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ పేసర్

భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మరో రికార్డును సాధించాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో సిరాజ్‌ బౌలర్ల విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు.

Mohammed Siraj: నెంబర్‌ వన్‌లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ పేసర్
New Update

భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మరో రికార్డును సాధించాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో సిరాజ్‌ బౌలర్ల విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు. ఆసియా కప్ ప్రారంభ సమయంలో ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో సిరాజ్‌ 9వ స్థానంలో నిలువగా.. టోర్నీ ముగిసిన అనంతరం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలోకి దూసుకొచ్చాడు. ఇటీవల ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మహ్మద్‌ సిరాజ్‌ రెచ్చిపోయాడు. ఆ ఇన్నింగ్స్‌లో భాగంగా సిరాజ్‌తన రెండో ఓవర్లో ఏకంగా నలుగురు కీలక బ్యాటర్లను ఫెవీలియన్‌ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఈ హైదరాబాదీ పేసర్ 6 వికెట్లు తీసి 21 పరుగులు ఇచ్చాడు.

సిరాజ్‌ ప్రదర్శనతో టీంమిండియా ఫైనల్‌ మ్యాచ్‌లో సులువుగా విజయం సాధించి ఆసియా కప్‌ను భారత్‌కు తీసుకు వచ్చింది. కాగా సిరాజ్‌తో పాటు ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో హేజిల్ వుడ్, ట్రెంట్ బౌల్ట్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీరితోపాటు అఫ్ఘనిస్థాన్‌ బౌలర్లు ముజీబుర్ రెహ్మన్, రషీద్‌ఖాన్‌ టాఫ్‌ 5లో స్థానం దక్కించుకున్నారు. మరోవైపు భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ మూడు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో రాణించిన సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ తొమ్మిది స్థానాలు మెరుగు పరుచుకొని 15వ స్థానానికి చేరుకున్నాడు.

మరోవైపు బాటింగ్‌ ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే.. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ అగ్రస్థానంలో కొనగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో శుభ్‌మన్‌ గిల్, సౌతాఫ్రికా బ్యాటర్‌ డసెల్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లోకి చేరుకున్నారు. ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీతో చెలరేగాడు. లంక స్పిన్నర్‌ల ధాటికి భారత బ్యాటర్లు ఫెవిలీయన్‌కు క్యూ కట్టగా.. శుభ్‌మన్‌గిల్‌ మాత్రం ఒంటరి పోరాటం చేసి టీమిండియాను గౌరవనీయమైన స్థాయిలో నిలిపాడు. కాగా వర్షం వల్ల ఆ మ్యాచ్‌ రద్దైంది.

#asia-cup #mohammad-siraj #icc-ranking #number-one #one-over #4-wickets #shabman-gill
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe