Crime News : ఆస్ట్రేలియాలో దారుణం.. చెత్త కుండీలో హైదరాబాదీ మహిళ మృతదేహం లభ్యం! ఆస్ట్రేలియా విక్టోరియాలో హైదరాబాద్‌కు చెందిన చైతన్య దారుణ హత్యకు గురయ్యింది. మౌంట్ పొల్లాక్ రోడ్డు పక్కన ఓ చెత్తబుట్టలో చైతన్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాధితురాలు హైదరాబాద్-ఏఎస్‌రావు నగర్ వాసి. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ భర్త అశోక్ రాజ్ ను పోలీసులు ఆదేశించారు. By Trinath 10 Mar 2024 in ఇంటర్నేషనల్ తెలంగాణ New Update షేర్ చేయండి Swetha Incident : ఆస్ట్రేలియా(Australia) లోని బక్లీ ఆఫ్ విక్టోరియా(Barkly Of Victoria) లో ఓ మహిళ మృతదేహం(Woman Dead Body) లభ్యమైంది. రోడ్డు పక్కన ఉన్న చెత్తకుండీ(Dustbin) లో చైతన్య మాదగాని, అలియాస్ శ్వేత(Swetha) అనే హైదరాబాదీ మహిళ(Hyderabad Woman) డెడ్‌బాడీ దొరికింది. చైతన్యను ఎవరో హత్య చేసినట్టుగా డెడ్‌బాడీ చూస్తుంటే అర్థమవుతుంది. అటు చైతన్య భర్తపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైతన్య భర్త తన 3 ఏళ్ల కొడుకుతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడని సమాచారం. బాధితురాలు హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్ వాసిగా తెలుస్తోంది. చైతన్య భర్త పేరు అశోక్‌రాజ్. హైదరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు మాదగాని బాల్‌శెట్టిగౌడ్, మాధవి దంపతుల కుమార్తె చైతన్య. జీలాంగ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఈ క్రైమ్ జరిగింది. విన్‌చెల్సీ సమీపంలో ఉన్న ప్రాంతమిది. బక్లీ పట్టణంలోని మౌంట్ పొల్లాక్ రోడ్‌లో చైతన్య మృతదేహం కనిపించింది. పోలీసులకు స్థానికులు కాల్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. మృతదేహాన్ని చెత్తకుండీలో నింపి తాడుతో కట్టి ఉంచారు. ఇక భర్త ఇండియా(India) కు ఎందుకు వచ్చారన్నది తెలియాల్సి ఉంది. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. చైతన్యను ఆమె నివాసంలోనే హత్య చేసి మృతదేహాన్ని చెత్తడబ్బాలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పాయింట్ కుక్‌లోని చైతన్య ఇంటి పొరుగువారు ఈ ఘటన గురించి తెలుసుకోని షాక్‌కు గురయ్యారు. చైతన్య ప్రేమగల మహిళగా చెబుతున్నారు. ఆమె సమాజంలోని ఇతరులతో ఫుడ్‌ని పంచుకోవడానికి ఇష్టపడతారని తెలిపారు. ఇక చైతన్యను దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. Also Read : డీఎస్సీ అభ్యర్ధులకు ఫ్రీ కోచింగ్..దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే.. #hyderabad #australia #death-mystery #dustbin మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి