Hyderabad: హైదరాబాద్‌ను టాప్ నగరాల సరసన నిలబెడతాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ను ప్రపంచంలోనే పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేది తమ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గడిచిన ఆరు నెలల్లో హైదరాబాద్‌లో లీజింగ్‌, ఆఫీస్‌ స్పేస్‌, రెసిడెన్షియల్ స్పేస్ కోసం పెరిగిన డిమాండ్ తో రియాల్టీ రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు.

New Update
Hyderabad: హైదరాబాద్‌ను టాప్ నగరాల సరసన నిలబెడతాం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth: హైదరాబాద్‌ను ప్రపంచంలోనే పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేది తమ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన సచివాలయంలో కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ వివిధ రంగాల్లో విస్తరిస్తూ గ్లోబల్ సిటీగా వృద్ధి చెందుతున్న తీరును సమావేశంలో కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ తమ అధ్యయన వివరాలను వెల్లడించింది.

గడిచిన ఆరు నెలల్లో హైదరాబాద్‌లో లీజింగ్‌, ఆఫీస్‌ స్పేస్‌, రెసిడెన్షియల్ స్పేస్ కోసం పెరిగిన డిమాండ్ తో రియాల్టీ రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి ప్రతి ఆరు నెలలకోసారి వెలువరించే నివేదిక జూలై నెలాఖరులో విడుదలవుతుందని తెలిపారు. సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు రూట్ విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారవుతుందని చెప్పారు. తెలంగాణ నుంచి అమెరికాలో ఉంటున్న వారి సంఖ్య, అక్కడి వెళ్లి వచ్చే వారి సంఖ్య పెరిగిందని చెబుతూ న్యూయార్క్​ వంటి నగరాలతో పోల్చుకునేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాల్సి ఉందని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు