Accident : కారు బీభత్సం.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తు, అతివేగంతో వ్యక్తిని ఢీకొట్టిన కారు ఆ తర్వాత కరెంట్ స్తంభాలను సైతం ఢీకొట్టి దూసుకెళ్లింది. స్పాట్‌లోనే వ్యక్తి మృతి చెందాడు. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజుల రామారంలో ఘటన చోటుచేసుకుంది. By Jyoshna Sappogula 11 Aug 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad : ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు (Road Accident) ఎక్కువుగా జరుగుతున్నాయి. అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్ (Drunk & Drive) చేయడం, నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. డ్రైవింగ్ చేసే వాళ్లు పీకలదాకా మద్యం సేవించి వాహనాన్ని నడిపడం ద్వారా వారి ప్రాణాలను మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నారు. Also Read: ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం! తాజాగా, హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తు, అతివేగంతో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు.. ఆ తర్వాత కరెంట్ స్తంభాలను సైతం ఢీకొట్టి దూసుకెళ్లింది. స్పాట్‌లోనే వ్యక్తి మృతి చెందాడు. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజుల రామారంలో ఈ ఘటన జరిగింది. Also Read: దారుణం.. ట్యూషన్ మాస్టర్ అని నమ్మించిన యువకుడు.. బాలికలను ఎత్తుకెళ్లి.. ప్రమాదం తర్వాత కారులోంచి దిగిన ఆరుగురు యువకులు కారును తీసుకెళ్లేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మృతుడు సెక్యూరిటీ గార్డు గోపిగా గుర్తించారు. #road-accident #hyderabad #car-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి