Telangana Elections 2023: హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్బీనగర్(LB Nagar) కాంగ్రెస్(Congress) అభ్యర్థి మధుయాష్కి గౌడ్ అతిథి గృహంపై అర్థరాత్రి వేళ పోలీసులు దాడులు చేశారు. గెస్ట్ హౌస్‌లో సోదాలు నిర్వహించారు. ఇళ్లంతా గాలించారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, సోదాల్లో భాగంగా రూ. 5.5 లక్షల నగదును గుర్తించారు పోలీసులు. ఈ డబ్బులకు లెక్కలు చూపాలని మధుయాష్కిని కోరారు పోలీసులు. డబ్బును సీజ్ చేశారు.
కాగా, అర్థరాత్రి వేళ పోలీసుల సోదాలపై మధుయాష్కి ఫైర్ అయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకే పోలీసులు ఇలా అర్థరాత్రి తన ఇంటిపై పడ్డారని ఆరోపించారు. ఎల్బీనగర్‌లో సుదీర్ రెడ్డి ఓడిపోతున్నాడనే భయం పట్టుకుందని, అందుకునే పోలీసులను పంపించారని మధుయాష్కి గౌడ్ ఆరోపించారు. అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడి పోలీసులు మూకుమ్మడి దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. పోలీసులు సోదాల పేరుతో కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని నిలదీశారు మధుయాష్కి.
Also Read:
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన..