/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-28T173553.461.jpg)
Crime: హైదరాబాద్ కేంద్రంగా పసి పిల్లల అమ్మకాల దందా జోరుగా సాగుతోంది. ఇతర రాష్ట్రాలనుంచి ముక్కుపచ్చలారని పసిగుడ్డులను తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మేడిపల్లికి చెందిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ రూ. 5 లక్షల చొప్పున పిల్లలను అమ్ముతున్నట్లు బాలల హక్కుల సంఘం అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు పలువురిని అరెస్ట్ చేశారు. అలాగే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, చట్టవిరుద్ధంగా 16 మంది పిల్లలను కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.
.@MedipallyPS of #RachakondaCommissionerate busted #inter_state #Child_Selling_Racket and #rescued (11) babies.
#CP_Rachakonda Dr. Tarun Joshi, IPS, appreciated the team involved in detecting the case.
@TelanganaCOPs @TelanganaDGP @DcpMalkajgiri @DCPLBNagar @DcpBhongir… pic.twitter.com/X3LiI9NTQ5— Rachakonda Police (@RachakondaCop) May 28, 2024
ఇదిలా ఉంటే.. పిల్లలను పెంచుకున్న పేరెంట్స్ రాచకొండ కమిషనరేట్ వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను శిశువిహార్ కు తరలిస్తుంటే అడ్డుకున్నారు. తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలను తమకే అప్పగించాలంటూ బోరున ఏడుస్తున్నారు. తమకు కడుపుకోత మిగల్చొద్దని వేడుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఆర్ ఎంపీ శోభారాణితో పాటు మరికొందరు ఏజెంట్లు లీగల్ అని చెప్పి పిల్లలను అమ్మారని, ఇప్పుడు అర్ధాంతరంగా తమవద్దనున్న బిడ్డలను బలవంతంగా తీసుకెళ్లడం అన్యాయమంటూ గుండెలు బాదుకుంటున్నారు. హృదయవిదారకర దృశ్యాలకు సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడొచ్చు.