Hyderabad: మా పిల్లలను మాకిచ్చేయండి సారూ.. రాచకొండ పోలీసు కార్యాలయం వద్ద తల్లుల ఆర్తనాదాలు!
ఇతర రాష్ట్రాల నుంచి పసి పిల్లలను తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలల హక్కుల సంఘం అందించిన సమాచారంతో 16 మంది పిల్లలను గుర్తించి శిశువిహార్ కు తరలించారు. వారిని పెంచుకున్న తల్లిదండ్రులు తిరిగి ఇచ్చేయాలంటూ గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.