Hyderabad People Going to Home Towns : పల్లెబాట పట్టిన పట్నం...హైదరాబాద్ రోడ్లన్నిఖాళీ

భాగ్యనగరం బోసిపోయింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి చాలామంది సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. సెలవులకు సాఫ్ట్ వేర్లంతా ఊరి బాట పట్టడంతో ఐటీ క్యారిడార్లు కూడా బోసిపోయాయి.

New Update
Hyderabad People Going to Home Towns : పల్లెబాట పట్టిన పట్నం...హైదరాబాద్ రోడ్లన్నిఖాళీ

Hyderabad : ఎప్పుడు బిజీ బిజీగా ఉండే హైదరాబాద్ రోడ్లన్ని ప్రస్తుతం ఖాళీగా దర్శనిస్తున్నాయి. భాగ్యనగరం బోసిపోయింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి చాలామంది సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. సెలవులకు సాఫ్ట్ వేర్లంతా ఊరి బాట పట్టడంతో ఐటీ క్యారిడార్లు కూడా బోసిపోయాయి. వందలాది టిఫిన్ సెంటర్లు, ఫుడ్ కోర్టులు కూడా మూతపడ్డాయి. రోడ్లమీద అసలు ట్రాఫిక్ అనేదే కనిపించడం లేదు. నగరానికి చెందిన స్థానికులు మాత్రం హైదరాబాద్ ఎప్పుడు ఇలానే ఉంటే బాగుటుందని చెబుతున్నారు. రోడ్లమీద ప్రస్తుతం ఎలాంటి ట్రాఫిక్ లేదని, తొందరగా గమ్యానికి చేరుకుంటున్నామని వాహనదారులు చెబుతున్నారు.

షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా రోడ్లన్ని నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి సెలవుల కారణంగా విద్యార్థులకు ముందుగానే సెలవులు ఇవ్వడంతో స్కూల్ జోన్లు కూడా బోసిపోయాయి. సంక్రాంతి మూడు రోజులు హైదరాబాద్ లో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.

సాధారణంగా బతుకమ్మ, దసరా పండుగలకు తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఊరెళ్తుంటారు. కానీ సంక్రాంతికి తెలంగాణవారితో పాటు ఆంధ్రా వారు కూడా సొంతూళ్లకు వెళ్తారు. దీంతో హైదరాబాద్ నగరం ఖాళీగా కనిపిస్తోంది. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. ఐటీ కారిడార్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, అమీర్ పేట్ ప్రధాన జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ భారీగా తగ్గింది.

మరోవైపు సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీఎస్ ఆర్టీసీ ఏకంగా 6,261 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు కూడా పలు బస్సులను ఏర్పాటు చేసింది. పాఠశాలలకు, కాలేజీలకు ముందుగానే సెలవులు ప్రకటించడంతో ఈనెల 12నే ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్‌లు కిటకిటలాడాయి. అలాగే తెలుగురాష్ట్రాల్లోని నగరాలు, పట్నాల నుంచే కాదు విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు చాలా మంది ఈసారి పండగకి సొంతూళ్లకు చేరుకున్నారు.

హైదరాబాద్ వాసులంతా గ్రామాలకు తరలివెళ్లడంతో.. సిటీలోని పలు ప్రాంతాల్లో నిఘా పెంచినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. తాళలు వేసిన ఇళ్లే టార్గెట్ గా దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండటంతో పెట్రోలింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మంగళవారం నుంచి ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు