Oyo Rooms Hyderabad: హైదరాబాద్ నగరంలో మరో నయా దందా బయటపడింది. ఇప్పటికే డ్రగ్స్, వ్యభిచార గృహాలు, మసాజ్ సెంటర్లలో గలీజ్ దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా సిటీలో ఎక్కడ పడితే అక్కడ ఓయో రూమ్స్ (OYO Rooms), పబ్ లు దర్శనిమిస్తున్నాయి. లంచాలకు అలవాటు పడిన కొందరు అవినీతి అధికారులు రాత్రికి రాత్రే నిర్వాహకులకు పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. దీంతో కమర్షియల్, ప్రాపర్టీ ట్యాక్స్ వసూల్ కావట్లేదని, ఇలాగైతే అభివృద్ధిపనులు ఎలా చేపట్టాలంటూ పలువురు కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బల్దియా కౌన్సిల్ మీటింగ్..
ఈ మేరకు మంగళవారం బల్దియా కౌన్సిల్ మీటింగ్ లో ప్రాపర్టీ ట్యాక్స్ పై ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ అంశాలపై పలువురు కార్పొరేటర్లు ఈ ప్రశ్నలు లేవనెత్తారు. జీహెచ్ ఎంసీ (GHMC) పరిధిలో విచ్చలవిడిగా ఓయో రూమ్స్, పబ్ లు (Pubs) దర్శనమిస్తున్నాయని జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేశ్ ఆరోపించారు. ఇవన్నీ కూడా పలు కాలనీల్లో రెసిడెన్షియల్ పర్పస్ లోనే కొనసాగుతున్నాయని, వీటిపై బల్దియాకు ఆదాయం రావడం లేదని లింగోజీ గూడ కార్పొరేటర్ రాజశేఖర్ వాపోతున్నారు. అంతేకాదు కొంతమది ఇండ్లలోనే ఓయో రూమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తమ దృష్టింకి వచ్చిందని చెప్పారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తేనే బల్దియా పనులు చేయగలమంటున్నారు. రెసిడెన్షియల్ పర్పస్ లో పర్మిషన్లు తీసుకొని రాత్రికి రాత్రే కమర్షియల్ గా మార్చే వాటిలో ఓయోలు ముందు వరుసలో ఉన్నాయని చెబుతున్నారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియోద్దీన్ డిమాండ్ చేశారు. విజిలెన్స్ తనిఖీలు చేసి చర్యలు తీసుకొని ఫైన్లు వేయాలని కోరారు.
ఇది కూడా చదవండి: Golden shirt: ప్రపంచంలో అత్యంత ఖరీదైన చొక్కా భారతీయుడిదే.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు!
కమీషన్లకోసం పర్మిషన్లు..
ఇదిలా ఉంటే.. ఓయో రూమ్స్ కు హైదరాబాద్ లో భారీగా క్రేజ్ ఉంది. ఇదే అదనుగా భావించిన అధికారులు కమీషన్లకోసం పర్మిషన్లు ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులకు ట్యాక్స్ కంటే తమకు జేబులు నిండటమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారని కార్పోరేటర్లు వాపోతున్నారు. ఎవరి ఆస్తులనైనా ఇంకొకరికి ఈజీగా మర్చేస్తున్నారని, ఇదే అధికారుల పనితీరును, నిర్లక్ష్యాన్ని బయటపెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ కార్పొరేటర్ మల్కాజిగిరి సర్కిల్ ఆఫీసును మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తన పేరు మీద చేయించిన విషయం చర్చనీయాంశమైంది. అప్లికేషన్ తో పాటు బీఆర్ఎస్గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో కూడా అప్ లోడ్ చేసినప్పటికీ దానిని గమనించకుండానే అధికారులు అప్రూవల్ ఇవ్వడం విశేషం. కాగా ట్యాక్స్ అసెస్ మెంట్ కు సంబంధించి ఆ విభాగ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానికి ఇది ఉదాహరణ అంటూ బల్దియా కౌన్సిల్ మీటింగ్ లో ఆందోళన వ్యక్తం చేశారు.