బాబు కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్‌లో ఈ నెల 14వ తేదీన నిలోఫర్ ఆస్పత్రి ( Niloufer Hospital)లో కిడ్నాప్ అయిన ఆరు నెలల బాబు కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా బుధవారం మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ చికిత్స కోసం ఫారీదా బేగం తన కొడుకును తీసుకొని వచ్చిందని..
భోజనం కోసం బయటకి తల్లి వెళ్ళింది. బాలుడు తల్లి భోజనం కోసం వెళ్లగా, వెంటనే బాలుడిని కిడ్నాప్ చేశారు. శ్రీను, మమత అనే ఇద్దరు కిడ్నాప్ చేశారు. గత కొంత కాలంగా అరుదైన వ్యాధితో వీళ్లకు పుట్టిన పిల్లలు చనిపోతున్నారు.
మరో బాబుని పెంచుకోవడం కోసం
సంతానం కలిగిన కూడా వీరికి పిల్లలు పుట్టి చనిపోతున్నారని డీసీపీ వెల్లడించారు. 15 రోజులు క్రితం కూడా దంపతులకు బాలుడు పుట్టాడని.. అయితే బాబుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో నీలోఫర్ చికిత్స కోసం తీసుకొచ్చిన తల్లిదండ్రులు తెలిపారు. అధిక రక్త స్నిగ్థత వ్యాధితో బాధ పడుతున్నారు. నిందితులు మగ పిల్లలు పుట్టితే చనిపోతారు. ఆడ పిల్ల పుడితేనే బతుకుతారు. ఇప్పటికే ఇద్దరు మగ పిల్లలు మృతి చెందారు. మూడో పిల్లోడు కూడా చనిపోతాడాని డాక్టర్లు తెలిపారు. బాలుడు ప్రస్తుతం నిలోఫర్‌లో చికిత్స పోతున్నాడు. పొందుతున్న అక్కడే తనకు పుట్టిన 15 రోజుల బాబును వదిలి ... మరో బాబుని పెంచుకోవడం కోసం ఎత్తుకెళ్లింది నిందితురాలు. అధిక రక్త హీనత వలన వీరికి పిల్లలు పుట్టినా.. ఆరోగ్యంగా ఉండటం లేదని డాక్టర్లు చెప్పారు. కత్రోత్ మమత బాలుడిని పెంచుకోవడం కోసం కిడ్నాప్ చేసి , భర్తకి సమాచారం ఇచ్చింది.
సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా..
కామారెడ్డి జిల్లా బాన్సువాడ టౌన్‌కు బాలుడుని తీసుకొని కిరాయి తీసుకున్న ఇంట్లో ఉన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుల పట్టుకున్నామన్నారు. నేను కిడ్నాప్ చేయడానికి కారణం, నన్ను చూడగానే ఆ బాలుడు నవ్వాడని.. కాబట్టే పెంచుకోవడం కోసం తీయుకెళ్లినట్లు విచారణలో తేలిందన్నారు. బాలుడుకి రెండు రోజులు నిందితురాలు పాలు ఇచ్చింది. నిలోఫర్ ఆస్పత్రి నుంచి జూబ్లీ బస్టాండ్ వరకు 100 కెమెరాలు జెల్లడ పట్టాముని,దీంతో బాన్సువాడ లో బాలుడును గుర్తించి , అదుపులోకి తీసుకున్నామని డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.