Hyderabad : హైదరాబాద్ కూకట్ పల్లిలో (Kukatpally) కూల్చివేతలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణాలను అధికారులు జేసీబీలతో కూల్చివేస్తున్నారు. జేఎన్టీయూ రైతుబజార్, కూకట్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్ ప్రాంతాల్లో ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సమక్షంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భూమిని ఎవరైనా కబ్జా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
Also Read : ఢిల్లీ ప్రజలు పాకిస్థానీల?.. అమిత్ షాపై కేజ్రీవాల్ ఫైర్
కూల్చివేతలపై స్థానిక బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై ఇలా ప్రవర్తిస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా.. కనీసం సమాచారం ఇవ్వకుండా.. ఇలా కూలుస్తారా అంటూ అధికారులను ఆయన ప్రశ్నించారు. లులు మాల్ (Lulu Mall) కోసం ఇంతమందిని రోడ్డున పడేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. కూల్చివేతలకు కారణమైన వారిపై ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. సమస్య పరిష్కారమయ్యేవరకు బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.