Independence day Hyderabad Metro Super Saver Offer: సందర్భానికి తగ్గట్టుగా.. పండుగల సమయంలో..వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులకు దగ్గరయ్యే హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) మరో అదిరిపోయే ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్ ఇప్పటికే మొదలైపోయింది కూడా. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు బంపర్ ఆఫర్(Independence Day Offer) ఇచ్చింది. కేవలం 59 రూపాయలకే నగరాన్ని చుట్టేసే ఆఫర్‌ని రన్ చేస్తోంది. ఈ ఆఫర్ ఇవాళ (ఆగస్టు 12), రేపు (ఆగస్టు 13)తో పాటు ఆగస్టు 15న అందుబాటులో ఉంటుంది. దీనికి ఫ్రీడమ్ ఆఫర్ అని పేరు పెట్టింది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ ఈవెంట్‌లో ఈ ఆఫర్‌ని ప్రారంభించారు మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి.
సూపర్ డూపర్ సేవర్:
ఈ సూపర్ సేవర్ ఫ్రీడం ఆఫర్ ప్రకారం ఆగస్టు 12, 13, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని అన్ని మెట్రో రైళ్లలో ప్రయాణికులు రూ.59ల రీఛార్జ్‌తో తిరగొచ్చు. ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఎక్కడా పరిమితులు లేవు. సాధారణంగా.. సూపర్ సేవర్ హాలిడే కార్డులో భాగంగా ఈ ఛార్జి రూ.99 ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫర్ కింద దీన్ని రూ.59కి తగ్గించారు. ఈ ఆఫర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, హైదరాబాద్ మెట్రో రైలు సౌలభ్యం, సామర్థ్యాన్ని ఆస్వాదించాలని కేవీబీ రెడ్డి ప్రతి ఒక్కరికీ కోరుతున్నారు. సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ ప్రయాణికులకు కొత్త అనుభుతిని మిగుల్చుతుందని చెబుతున్నారు. తమకు ప్రజల పట్ల ఏ విధమైన వైఖరి ఉందో చెప్పడానికి ఈ ఆఫర్ నిదర్శనంగా నిలుస్తుందని హైదరాబాద్ మెట్రో రైల్ తెలిపింది.
మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ " మా విలువైన కస్టమర్లకు ఈ ప్రత్యేకమైన SSF ఆఫర్‌ని అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ ఆఫర్ ప్రయాణాన్ని సరసమైనదిగా చేయడమే కాకుండా మన నగరాన్ని ఉత్సాహవంతంగా మార్చాలనే మా దృష్టితో ప్రతిధ్వనిస్తుంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని.. హైదరాబాద్ మెట్రో రైలు సౌలభ్యం, సామర్థ్యాన్ని అనుభవించాలని మేము ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాము' అని చెప్పారు కేవీబీ రెడ్డి. సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ ఈ నెల 12, 13, 15 తేదీల్లో అందుబాటులో ఉంది. ఆగస్టు 14న ఈ ఆఫర్ అందుబాటులో లేదని ప్రయాణికులు గుర్తుపెట్టుకోవాలి. ఈ నాలుగు రోజుల్లో మూడు రోజుల పాటు కేవలం నామమాత్రపు ధరతో ప్రయాణికులు అపరిమిత మెట్రో ప్రయాణాల్లో ఆనందించవచ్చు. రూ.59 సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్‌ని రీలోడ్ చేయడం ద్వారా ఈ డీల్‌ని యాక్సెస్ చేయవచ్చు.
Also Read: గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో ధోనీ బ్యాట్.. నిజమేనా?