Hyderabad: సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వీడియోలు క్రియేట్ చేస్తున్నారంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. తన ప్రతిష్టను దిగజార్చే విధంగా వీడియోలు ఉన్నాయని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో తనను ట్రోల్స్ చేస్తూన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వీడియోలకు సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు అందించారు. వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.
ఈ మేరకు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి హాజరయ్యారు. అయితే మంత్రికి స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట జరిగింది. దీంతో ప్రొటోకాల్ పాటించలేదంటూ కలెక్టర్ అనుదీప్‌పై మంత్రి పొన్నం అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అలకబూనిన మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి కొద్దిసేపు బయటే కూర్చోవడం విశేషం. కాగా ఈ ఇష్యూపైనే నెట్టింట ట్రోలింగ్ నడుస్తోంది.