రాత్రికి వస్తేనే సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటూ జయచంద్ర అనే వ్యక్తి ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ను వేధించిన సంఘటన హైదరాబాద్‌లో వెలుగులోకొచ్చింది. ఈ మేరకు మధురానగర్‌లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కీచకుడు జయచంద్రపై కేసు నమోదు చేశారు. బాధితురాలు మీడియా ముందుకు వచ్చేందుకు భయపడుతుండడంతో గురువారం నాడు ఆర్‌టీవీ ప్రతినిధి ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. సినిమాల్లో పనిచేస్తున్న తనను జయచంద్ర అనే వ్యక్తి తనను లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. అతనిని తాను ఇంతవరకూ చూడలేదని తెలిపింది.
పలు కొత్త నెంబర్ల నుంచి తనకు ఫోన్ చేసేవాడని... అడగకుండానే ఫోన్ పేకు డబ్బులు పంపేవాడని తెలిపింది. ఇటీవల కూడా ఫోన్ పేలో రూ.10వేలు పంపి.. నీ కోసం ఫ్లాట్ తీసుకున్నా.. రూంకి రావాలని వేధించాడని తెలిపాడు. తన కోరిక తీరిస్తే సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని ప్రలోభాలకు గురిచేశాడని తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తనను చంపేస్తానని బెదిరించాడని.. తన సొంత గ్రామానికి వెళ్లి మరీ తనపై అసభ్య ప్రచారం చేసి బెదిరిస్తున్నాడని బాధితురాలు పేర్కొన్నారు. తాను ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశానని.. వారే అతడి సంగతి చూసుకుంటారని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరారు.
అసలు జయచంద్ర ఎవరు?
అసలు జయచంద్ర అనే వ్యక్తి ఎవరన్నది ఇప్పుడు సినీ ఇండస్ర్టీలో చర్చనీయాంశంగా మారింది. జయచంద్ర వెనుక ఎవరున్నారు..? అసలు ఎందుకు అతను జూనియర్ ఆర్టిస్టులను వేధిస్తున్నాడు..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు దీనిపైనే విచారణ చేస్తున్నట్లు తెలిసింది. జయచంద్ర అనే వ్యక్తి జూనియర్ ఆర్టిస్టులను మాట్లాడటం.. కాంట్రాక్టులు మాట్లాడటం చేస్తుంటారని తెలిపింది. ప్రస్తుతం ఇతని వేధింపుల నేపథ్యంలో కొత్తగా సినీ ఇండస్ర్టీకి రావాలనుకున్న యువతులు భయానికి లోనవుతున్నారు. సినిమా ఫీల్డ్ అంటేనే లోబర్చుకుంటారన్న అపోహలు తల్లిదండ్రుల్లో నెలకొంటున్నాయి. ఇలాంటి కీచకులను బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీ..!!