TS Crime: కుటుంబాన్ని మింగిన ఆన్లైన్ బెట్టింగ్.. పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య! హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజులరామారాంలో ఇద్దరు పిల్లలను చంపి భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్(40), వర్షిణి(33), రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది. By Vijaya Nimma 01 Sep 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి TS Crime: హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజులరామారాంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్(40), వర్షిణి(33)గా గుర్తించారు. వారి పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3) ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారం కారణంగా వీరు ఆర్థిక ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వెంకటేష్, వర్షిణి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం ఇంట్లో నుంచి బయటకు ఎవరూ రాకపోవడంతో స్థానికులు అనుమానం వచ్చింది. ఇంట్లో వాళ్లని పిలిచినా ఎవరు స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి చుట్టు పక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకున్నారు. తలుపులు తీసి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి నలుగురు చనిపోయి పడి ఉన్నారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ పూర్తయిన తర్వాత తదుపరి విషయాలను వెల్లడిస్తామని జీడిమెట్ల పోలీసులు తెలిపారు. Also Read: నారాయణపేటలో విషాదం.. గోడ కూలి తల్లికూతుళ్లు మృతి #ts-crime #online-betting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి