Rains: మరో 5 రోజులు హైదరాబాద్ లో వానలే వానలు.. GHMC కీలక అలర్ట్! హైదరాబాద్ లో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు రోడ్లపై నడిచేటప్పుడు, వెహికల్స్ పై వెళ్లే సమయంలో మ్యాన్ హోల్స్ ను చూసుకోని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. By Jyoshna Sappogula 04 Sep 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hyderabad Rains: హైదరాబాద్ లో మరో ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై GHMC కీలక అలర్ట్ జారీ చేసింది. Also Read: వైసీపీ నాయకులకు డిప్యూటీ సీఎం స్వీట్ వార్నింగ్.. పిచ్చి..పిచ్చి మాటలు కాదు.. సహాయం చేయండి.! వాగులు, వంకలు, నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంటుందని, కావున వాటి వద్దకి ఎవరు వెళ్లవద్దని సూచించింది. ప్రజలు నీరు నిలిచి ఉన్న చోట రోడ్లపై నడిచేప్పుడు మ్యాన్ హోల్స్ ను చూసుకోని నడవాలని.. #GHMC సిబ్బంది తప్పితే ఎవరూ కూడా మ్యాన్ హోల్స్ ను తెరిచే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. అది చట్టరీత్యా నేరమని పేర్కొంది. ట్రాన్ఫార్మర్లను, విద్యుత్ స్తంభాలను తాకవద్దని.. ముఖ్యంగా చిన్న పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని తెలిపింది. పొంగుతున్న జలాశయాలు, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లే సాహసం చేయరాదని సూచించింది. వర్షం వల్ల వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది కావున పరిమిత వేగంతో నడపాలని తెలిపింది. విపత్కర సమయాల్లో సహాయం కోసం GHMC కంట్రోల్ రూమ్ నంబర్ కి 040-21111111 లేదా DRF 9000113667 కి కాల్ చేయాలని వెల్లడించింది. #hyderabad #hyderabad-rains #telangana-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి