ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణకు వస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో పర్యటించి రూ.13.500 కోట్లపలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఈసారి కూడా ప్రధానికి స్వాగతం పలకడం లేదు. ఇక, హైదరాబాద్‌లో మరోసారి మోదీ పర్యటన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. దీనిపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
This browser does not support the video element.
సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి ముఖం చూపించుకోలేకనే అనవసర విమర్శలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. మోదీకి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వేసి తెలంగాణ ప్రజల్లో అభాసుపాలు కాకండి అంటూ హితబోధ చేశారు ఎమ్మెల్యే. ఎంఐఎం, బీఆర్ఎస్‌లు వెన్నుపోటు పార్టీలని వ్యాఖ్యానించిన ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తెలంగాణలో అభివృద్ధి పనులపై మోదీ రాష్ట్రానికి వస్తుంటే.. మోదీ పర్యటనపై ట్విట్టర్ జోకర్స్ కామెంట్ చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. తెలంగాణకి ఏమి ఇచ్చారు..? ఏం చేశారంటూ..? ట్విట్టర్ జోకర్స్ కామెంట్ చేయడం కాదు..రాష్ట్రానికి వచ్చిన మోదీని కేసీఆర్, కేటీఆర్ దమ్ముంటే డైరెక్టుగా వెళ్లి అడగండి అంటూ సవాల్ చేశారు.
మీకు దమ్ముందా..?
మీరు మోదీ దగ్గరకు వెళ్తే ఎవరు ఆపలేరు అంటూ ఘటున సమాధానం చేశారు. మోదీ ముందు మాట్లాడడానికి కేసీఆర్, కేటీఆర్‌లకు దమ్ముందా..? అని ప్రశ్నించారు. 2014లో మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు... మోదీ గురించి గొప్పగా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం లాగా వెనుక నుంచి పొడిచే అలవాటు కేసీఆర్, కేటీఆర్‌లకు ఉందని విమర్శించారు. మీకున్న అలవాటు మోదీకి లేదన్నారు. మోదీ ముందుకు ఎవరు పోయిన సమాధానం చెప్తారు అన్నారు. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. మోదీ వెనకాల మాట్లాడే వారంతా.. మోదీ ముందు పిల్లులే.. ఈ విషయం తెలంగాణ ప్రజలు గమనించాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.
సవతితల్లి ప్రేమ అంటూ..
హైదరాబాద్‌లో పోస్టర్లు కలకలం రేపాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ మరోసారి వెలిశాయి. ఏపీలో పోలవరం ప్రాజెక్టు, కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు. మరి తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు ఇవ్వలేదంటూ..!! ఫ్లెక్సీలు వేశారు. మోదీది తెలంగాణ మీద సవతితల్లి ప్రేమ అంటూ విమర్శించారు. ప్రధాని మోదీకి మహబూబ్‌నగర్‌లో, తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ ఆ పోస్టర్ల సారాంశంగా ఉంది. అయితే.. ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే విషయంలో జరిగిన అన్యాయంపై ఈ పోస్టర్ల ద్వారా ప్రశ్నించారు కొందురు.