Raja Signh: అలా చేసి అభాసుపాలు కావొద్దు.. బీఆర్ఎస్కు రాజా సింగ్ వార్నింగ్
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్‌లకు దమ్ముంటే మోదీని కలవాలన్నారు. ప్రధానిని కలసి తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులను కేసీఆర్ అడగాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఏం నిధులు కావాలో ప్రధానని కలిసి ఎందుకు అడగటం లేదు?.. అని ప్రశ్నించారు. ప్రధానికి ముఖం చూపించుకోలేకనే బీఆర్ఎస్ ప్రభుత్వం అనవసర విమర్శలు చేస్తున్నారని గోషామాల్ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.