హైదరాబాద్ ఓటర్ల మొద్దు నిద్ర..ఇప్పటికీ కేవలం 13 శాతమే పోలింగ్!

సెలవు అయితే తీసుకున్నారు కానీ దేనికోసం అయితే హాలిడే ఇచ్చారో ఆ విషయం మాత్రం మర్చిపోయారు. భారతదేశ ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం అయిన ఓటును వేయడానికి కూడా బద్ధకిస్తున్నారు హైదరాబాద్ ఓటర్లు. పోలింగ్ మొదలై ఐదు గంటలు గడుస్తున్నా ఇంకా 13 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది.

హైదరాబాద్ ఓటర్ల మొద్దు నిద్ర..ఇప్పటికీ కేవలం 13 శాతమే పోలింగ్!
New Update

మీరెక్కడి జనం రా నాయనా...ఇంత బద్ధకిస్టులుగా, నిర్లక్ష్యంగా తయారయ్యారేంటి అంటున్నారు హైదరాబాద్ ఓటర్లను చూసినవారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం ఉదయాన్నే క్యూల్లో నిలబడి, వెయిట్ చేసి మరీ ఓట్లు వేశారు కానీ హైదరాబాద్ వాసులు మాత్రం ఇల్లు కదలడం లేదు. మొత్తం తెలంగాణలోనే హైదరాబాద్ లో అత్యంత తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చును. ఈ ఏడాది కూడా హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తక్కువే నమోదయ్యేట్టుంది. తెలంగాణ వ్యాప్తంగా అతి తక్కువ ఓటింగ్ హైదరాబాద్ లోనే కావడంతో ఈ డిస్కషన్ జరుగుతోంది.

హైదరాబాద్ లో ఉదయం గంటల వరకు 2018లో 22 శాతం ఓటింగ్ నమోదు అయితే ప్రస్తుతం కేవలం 20 శాతం మాత్రమే రిజిస్టర్ అయింది. అంటే దీన్ని లాస్ట్ టైమ్ కన్నా ఈసారి హైదరాబాద్ ఓటర్లు మరింత నిర్లక్ష్యంగా ఉన్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లో అత్యల్పంగా నాంపల్లిలో 0.5 శాతం, సనత్ నగర్ లో 0.2 శాతం, కూకట్పల్లిలో 1.9 శాతం, మేడ్చల్లో 2 శాతం,గోషామహల్ లో 2 శాతం, చార్మినార్లో 3 శాతం, ముషీరాబాద్ లో 4 శాతం,రాజేంద్రనగర్ లో అత్యధికంగా 15 శాతం పోలింగ్ నమోదయ్యింది.

Also read:తెలంగాణలో ఇప్పటివరకూ ఎంత పోలింగ్ శాతం నమోదయ్యిందంటే?

ఎన్నికల పోలింగ్ రోజును పెయిడ్ హాలిడేగా ప్రకటిస్తుంది ప్రభుత్వం. చాలా ప్రవైటే కంపెనీలు కూడా ఇదే పనిని చేస్తున్నాయి. అయితే దీన్ని ఓటర్లు తమ అడ్వాంటేజి కింద తీసుకుంటున్నాయి. సెలవు వచ్చిందే చాలు అని ముసుగు తన్ని పడుకున్నట్టుననారు. లేకపోతే బారెడు పొద్దెక్కినా...సూర్యుడు నడినెత్తికి వచ్చినా కూడా ఇంకా ఇళ్ళల్లోంచి కదలడం లేదు.

ఇంతకు ముందు ఓటు వెయ్యకుండా ఉండడానికి ఏదో ఒక సాకు చెప్పేవారు. స్లిప్పు రాలేదు, పోలింగ్ స్టేషన్ తెలియదు అంటూ...కానీ ఇప్పుడు అలాంటివి చెప్పడానికి కూడా లేవు. ఎందుకంటే టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. దానికి తగ్గట్టే ప్రభుత్వము, జీహెచ్ఎంసీలు యాప్ లు కరాయేట్ చేసి మరీ అన్ని వివరాలను పొందుపరిచారు. ఎక్కడిక్కడ మొత్తం ఇన్ఫర్మేసన్ అందుబాటులో ఉండేలా చేశారు. మరోవైపు ర్యాపిడో లాంటి ఫ్రీ సర్వీనులు ఇస్తున్నా వాళ్ళల్లో చైతన్యం మాత్రం రావడం లేదు. వీకెండ్ లో కూడా ఇంత రిలాక్స్ అవ్వరేమో. వీకెండ్స్ లో మాల్స్ కు, రెస్టారెంట్ లకు తిరగడానికి చూపించే ఉత్సాహంలో సగం ఉత్సాహం కూడా ఓటెయ్యడానికి చూపించడం లేదు. దీంతో హైదరాబాద్ ఓటర్లను అందరూ తెగ తిడుతున్నారు. ఇంత బాధ్యతారహితంగా ఉన్నారేంటి అంటూ విమర్శిస్తున్నారు. మరీ ఇంత బద్ధకమైతే మీరేం బాగుపడతారు అంటూ తిడుతున్నారు. ఈసీ ప్రధాన అధికారి వికాస్ రాజ్, ప్రముఖులు పదేపదే ఓటెయ్యండి..ఇది మీ హక్కు అని చెబుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఇది కేవలం నిర్లక్ష్యమా లేక రాజకీయాల మీద, నాయకుల మీద విముఖతో తెలియడం లేదు. పోనీ వాటి పట్ల ఇష్టం లేకపోయినా కనీసం నోటా అయినా వేసి తమ వ్యతిరేకత తెలియజేయాలి కదా అంటూ విమర్శలు తెగ వస్తున్నాయి. సో అర్బన్ పీపుల్ ఇప్పటికైనా మేల్కొని ఓటేయడానికి వెళ్లండి అంటూ చెబుతున్నారు.

మరోవైపు ఓటు వేయనివారిని తీవ్రంగా విమర్శించారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఓటేం వేస్తాం లే అంటూ ఇళ్ళల్లో నిద్రపోయే వారికి ఒకటే చెప్పండి..ప్రభుత్వం తమకు ఇది చేయలేదు, అది చేయలేదు అని నిందించొద్దు..అలా మాట్లాడాలన్నా అయినా లేచి వెళ్ళి ఓటేయండి అంటూ గట్టిగా చెప్పారు.

#hyderabad #polling #voting #least
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe