Cyber Threat : అయోధ్య పేరుతో లింక్స్! క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ!

'అయోధ్య లైవ్ ఫోటోలు' ఉన్నాయని పేర్కొంటూ ఆన్‌లైన్‌లో చెలామణి అవుతున్న లింక్‌లను క్లిక్ చేయవద్దని సైబర్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలా క్లిక్‌ చేయడం వల్లన సైబర్‌ నేరగాళ్లు మొబైల్‌ హ్యాక్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు బ్యాంక్‌ ఖాతాల నుంచి డబ్బులు దోచుకునే ప్రమాదం ఉంది.

Cyber Threat : అయోధ్య పేరుతో లింక్స్! క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ!
New Update

Do Not Open Ayodhya Spam Links : రేపే(జనవరి 22) అయోధ్య(Ayodhya) లో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ. దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఆ క్షణం రావడానికి కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ఓవైపు ప్రజలు భక్తితో మునిగితేలుతున్న వేళ.. మరోవైపు సైబర్‌ నేరగాళ్లు తన బ్రెయిన్‌కు పదును పెడుతున్నారు. భక్తి ముసుగులో ఎలా దోపిడి చేయవచ్చోనని ఆలోచిస్తున్నారు. భక్తిని క్యాష్‌ చేసుకోని డబ్బులు ఎలా సంపాదించాలా అని థింక్‌ చేస్తున్నారు. అందుకే పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అయెధ్య పేరిట వచ్చే లింక్స్‌(Spam Links) ను క్లిక్‌ చేయవద్దని కుండబద్దలు కొడుతున్నారు.



ఆ లింక్‌లు క్లిక్ చేయవద్దు:

అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠకు ముందు సైబర్‌ పోలీసులు(Cyber Police) కీలక సూచనలు చేశారు. 'అయోధ్య లైవ్ ఫోటోలు'(Ayodhya Live Photos) ఉన్నాయని పేర్కొంటూ ఆన్‌లైన్‌(Online) లో చెలామణి అవుతున్న లింక్‌లను క్లిక్ చేయవద్దని చెబుతున్నారు. వాటి వల్ల కలిగే ముప్పు గురించి సైబర్ క్రైమ్(Cyber Crime) పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ట్విటర్‌లో ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు. 'జనవరి 22, 2024, ఆ తర్వాత, 'అయోధ్య లైవ్ ఫొటోలు' లేదా ఇలాంటి కంటెంట్‌ను కలిగి ఉన్న అనేక మొబైల్ పరికరాలలో లింక్ సందేశాన్ని స్వీకరించే అవకాశం ఉంది. మీరు అలాంటి లింక్‌లను తెరవకుండా ఉండటం అత్యవసరం, అలా చేయడం వలన మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది.. మీ బ్యాంక్ ఖాతాలు దోచుకునే అవకాశం ఉంది..' అని ట్వీట్ చేశారు.



ముఖ్యంగా, ఇలాంటి సైబర్ బెదిరింపులకు ఎక్కువ అవకాశం ఉన్న సీనియర్ సిటిజన్‌లకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఈ సందేశాన్ని వ్యాప్తి చేయాలని సైబర్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Also Read: పూలు, లైటింగ్‌ తో మెరిసిపోతున్న అయోధ్య..!

WATCH:

#ayodhya #cyber-attacks #ram-mandir #cyber-crime
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe