Telangana: పండుగ వేళ పోలీసుల షాక్.. 2 గంటలే టపాసులు కాల్చేందుకు పర్మిషన్!

జంట నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చడంపై నిషేధం ఉందని.. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య హెచ్చరించారు. పండుగ వేళ రాత్రి 8 నుంచి 10 వరకూ మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు.

New Update
Diwali festival: బాణాసంచా దుకాణాలపై నిఘా పెట్టాం.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

దీపావళి వేడుకల నేపథ్యంలో జంటనగరాల ప్రజలకు హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య కీలక సూచనలు చేశారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉందని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు. పండుగ వేళ రాత్రి 8 నుంచి 10 వరకూ మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతి ఉందని పేర్కొన్నారు. క్రాకర్స్, డ్రమ్స్ నుంచి వచ్చే శబ్దానికి సంబంధించి పరిమితులు ఉన్నాయన్నారు. ఈ విషయంలో కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ ఉత్తర్వులు 12వ తేదీ ఉదయం 6 నుంచి 15వ తేదీ ఉదయం ఆరు వరకూ అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

Also Read: ఒక్క రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు.. ఆ పార్టీ సంచలన హామీ..

ఇదిలాఉండగా.. రాజస్థాన్‌లో వాయు, శబ్ద కాలుష్యానికి సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌పై ఇటీవల జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. బాణసంచా తయారీలో బేరియంతో పాటు ఇతర నిషేధిత పదార్థాలను వాడకూడదని గతంలోనే తీర్పు వెలువరించిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఉందని, వాటిని దీపావళి వంటి పండుగ వేళల్లో రాత్రి 8 నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే కాల్చుకోవాలని ఆదేశించింది. అలాగే ఈ నిబంధనలన్నీ కూడా రాష్ట్రాలకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Also Read: దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఎస్సై..