/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-47-6.jpg)
SHANTHI : మీడియాలో తనపై వస్తున్న వార్తల్ని ఆపేయాలంటూ శాంతి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు (Hyderabad City Civil Court) ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా శాంతి విజ్ఞప్తిపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఇకపై శాంతికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను మీడియాలో ప్రసారం చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. శాంతి (Shanthi) వ్యక్తిగత జీవితంలోపాటు తన పెళ్లిలు, పిల్లల గురించి ఎలాంటి వార్తలు చూపించొద్దని స్పష్టం చేసింది. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కోర్టు ధిక్కరణ అవుతుందని శాంతి లాయర్లు హెచ్చరించారు.
Also Read : మేడిగడ్డ ప్రాజెక్టుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..