TS News: హైదరాబాద్‎లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ? ఈ సారి గులాబీ బాస్ అజెండా ఇదే...!!

బీఆర్ఎస్ పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతోందా? గోదావరి, కృష్ణా జలాలపై నీటి పోరు యాత్ర చేపట్టనుందా? కాళేశ్వరం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిపోరు యాత్రకు శ్రీకారం చుట్టనుందా?అంటే అవును అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఈసారి గులాబీ బాస్ అజెండా ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

TS News: హైదరాబాద్‎లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ? ఈ సారి గులాబీ బాస్ అజెండా ఇదే...!!
New Update

TS News:  తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నిర్వహించిన మొదటి సభ నల్లగొండ భారీబహిరంగసభ. ఈ సభకు గులాబీ బాస్ కేసీఆర్ హాజరై సభను సక్సెస్ చేశారు. ఎన్నికల తర్వాత నల్లగొండలో తొలి సభ పెట్టగా...ఇప్పుడు రెండో సభను హైదరాబాద్ లో నిర్వహించేందుకు బీఆర్ఎస్ పక్కా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ మార్చి రెండో వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ లోపే త్వరలోనే హైదరాబద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత యోచిస్తున్నట్లు సమాచారం. గోదావరి, కృష్ణా జలాలపై బీఆర్ఎస్ నీటిపోరు యాత్ర చేపడుతున్నట్లు ఆపార్టీ వర్గాలు అంటున్నాయి. కాళేశ్వరం, నాగార్జునసాగర్ నుంచి ఈయాత్ర ఉండనుంది.

తెలంగాణలో నీటిపారుదల అంశంపై కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రగడ నెలకొన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ వేదికగా ఒకరిపై ఒకరు ఘాటుగానే విమర్శలు చేసుకున్నారు. ఈ అంశంపైన్నే బీఆర్ఎస్ పార్టీ నల్లగొండలో సభను నిర్వహించింది. ఈ సభలో గులాబీ బాస్ ఎమోషనల్ గా మాట్లాడారు. పదవి దిగిపోయాక తొలిసారి ప్రజలకు మధ్యకు వచ్చి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కృష్ణా నది ప్రాజెక్టులను క్రిష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఈ సభలో ప్రసంగించారు. ఇప్పుడు మరో సభను హైదరాబాద్ లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కాగా పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో తన సత్తాచాటేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నల్లగొండ సభ విజయవంతం కావడంతో ఫుల్ జోష్ మీదున్న బీఆర్ఎస్..ఇదే ఊపుతో కాంగ్రెస్ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ కోసం కొట్లాడేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు మరోసారి ఈ సభను నిర్వహించే ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం..పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల..!!

#general-elections-2024 #brs-public-meeting #brs-news #telangana-water-issues
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe