ట్రాఫిక్‌ రహిత సిటీగా మార్చే దిశగా భాగ్యనగరంలో మెట్రో విస్తరణ: మెట్రో ఎండీ

రోజురోజుకు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో మెట్రోను నగరంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్‌ చుట్టూ విస్తరించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో విస్తరణకు సంబంధించి ఇప్పటికే రూ.69 కోట్లను కెటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా మెట్రో విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఎండీ తెలిపారు.

ట్రాఫిక్‌ రహిత సిటీగా మార్చే దిశగా భాగ్యనగరంలో మెట్రో విస్తరణ: మెట్రో ఎండీ
New Update

హైదరాబాద్‌ మెట్రో కారిడార్ విస్తరణకు సంబంధించి మెట్రో ఎండీ ఆగస్టు 1 (మంగళవారం)న బేగంపేట్ మెట్రో రైల్ భవన్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్‌ నుంచి పటాన్‌చెరువు 29 కిలోమీటర్లు, తార్నాక నుంచి ఈసీఐఎల్‌ వరకు 8 కిలోమీటర్లు, ఎల్‌బీనగర్‌ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు మెట్రో కారిడార్‌ విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పటాన్‌ చెరు నుంచి నార్సింగి వరకు 22 కి.మీ మేర మెట్రో కారిడార్‌, తుక్కుగూడ, బొంగుళూరు, పెద్ద అంబర్‌పేట వరకు 40 కిలోమీటర్లు మెట్రో కారిడార్‌ నిర్మించనున్నట్లు ఎండీ తెలిపారు.జేబీఎస్‌ నుంచి తూంకుంట వరకు డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మించనున్నట్లు NVS రెడ్డి తెలిపారు. అలాగే ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు మెట్రో రైలును విస్తరింపచేసి కోటి జనాభాకు సరిపడేలా నగరంలో మెట్రోను విస్తరించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

నాగోల్‌ టు ఎల్‌బీనగర్‌ వరకు మెట్రో అనుసంధానం

telangana-news-hyd-Metro-expansion-in-the-city-declared-metro-md

గతంలో తన ప్రతిపాదనను అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. నాగోల్‌ టు ఎల్‌బీనగర్‌కు మెట్రోను అనుసంధానిస్తామన్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా మెట్రో పనులు త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు 28 కిలోమీటర్ల మేర మెట్రో రైలు విస్తరించనున్నట్లు తెలిపారు. ఉప్పల్ నుంచి బీబీనగర్‌ వరకు 25 కిలోమీటర్లు, తార్నాక నుంచి మౌలాలి వరకు ఐదు స్టేషన్లతో కూడిన మెట్రో కారిడార్‌ని నిర్మిస్తామని మెట్రో ఎండీ తెలిపారు.

వచ్చే ఏడాది 7 లక్షలకు చేరుకోనున్న మెట్రో ప్రయాణికులు

telangana-news-hyd-Metro-expansion-in-the-city-declared-metro-md

కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో కలిస్తే మెట్రో రైలు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు అక్కర్లేదని ఎండీ తెలిపారు. ప్రస్తుతం సరాసరి మెట్రోలో 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని మరో ఏడాది నాటికి ఆ సంఖ్య 7 లక్షలకు చేరుకుంటుందని అన్నారు. ఓఆర్ఆర్ మెట్రోను నాలుగు కారిడార్‌లుగా విభజించామన్నారు. హైదరాబాద్ మహానగర భవిష్యత్తు అవసరాలకనుగుణంగానే వీటిని అన్నివిధాలుగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేలా నగరమంతా విస్తరించేలా అన్ని ఏర్పాట్లను తీసుకోనున్నట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. దీంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్య అనేదే ఉండదు నగరంలో ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. దీంతో పాటుగా అనుకున్న సమయానికి గమ్యానికి ప్రయాణికులు చేరుకుంటారని మెట్రో ఎండీ తెలిపారు.

#telangana #hyderabad-metro #metro-corridor-expansion
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe