ట్రాఫిక్ రహిత సిటీగా మార్చే దిశగా భాగ్యనగరంలో మెట్రో విస్తరణ: మెట్రో ఎండీ
రోజురోజుకు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్లో మెట్రోను నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ విస్తరించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో విస్తరణకు సంబంధించి ఇప్పటికే రూ.69 కోట్లను కెటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా మెట్రో విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఎండీ తెలిపారు.