బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతానికి స్థిరంగా ఉంది. దాని ప్రభావం వల్ల హైదరాబాద్ గత కొన్ని రోజులుగా తడిసి ముద్దవుతుంది. గురువారం కూడా నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే నగరానికి వాతావరణ కేంద్రం ఓ హెచ్చరిక జారీ చేశారు.
గురువారం రాత్రి నగరంలో గంటకు 5 సెం.మీ నుంచి 6 సెం.మీ వర్షం కురిసే అవకాశలున్నట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. నగరంలో బుధవారం సాయంత్రం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది.
దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, కోఠీ, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్, మారేడుపల్లి, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సీతాఫల్‌మండి, కుత్బుల్లాపూర్, నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్టం, చాంద్రాయణగుట్ట, సాగర్ రింగ్‌రోడ్డు, బీఎన్‌రెడ్డిలో భారీ వర్షం కురుస్తుంది.
వర్షాల ధాటికి లింగపల్లి రైల్వే అండర్‌పాస్ వద్ద భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి-లింగంపల్లి మార్గాల్లో వెళ్లాల్సిన వాహనాలను ట్రాఫిక్‌పోలీసులు దారిమళ్లిస్తున్నారు. నాగోల్‌లోని అయ్యప్ప కాలనీలో ఇండ్లలోకి వరద నీరుచేరింది. అయితే భారీ వర్షాలతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా వచ్చిననీటిని వచ్చినట్లే పోయేట్లు చూస్తున్నారు.
కాగా, మరో పది నిమిషాల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భార్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. డీఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బీఆర్‌కే భవన్ వద్ద రోడ్డుపై చెట్టు కూలిపోయింది. దీంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్‌లో వర్షం పరిస్థితులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రస్తుత పరిస్థితులు, అందుతున్న సహాయక చర్యలపై మేయర్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్‌లతో కలిసి పర్యవేక్షించనున్నారు.