Hybrid Pitch: ఐపీఎల్ మ్యాచ్ ల కోసం హైబ్రిడ్ పిచ్ లు.. టీ20, వన్డేల్లోనూ ప్రయోగం!

టీ20, వన్డేల్లో బ్యాటర్లు భారీ స్కోర్లు చేస్తూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ సరికొత్త ప్రయోగం మొదలుపెట్టింది. బంతికి, బ్యాట్ మధ్య పోరును రసవత్తరంగా మార్చేందుకు హైబ్రిడ్‌ పిచ్‌లు తయారు చేస్తోంది. ధర్మశాల వేదికగా ఈ పిచ్ పై రెండు ఐపీఎల్ మ్యాచ్ లు ఆడించనుంది.

New Update
Hybrid Pitch: ఐపీఎల్ మ్యాచ్ ల కోసం హైబ్రిడ్ పిచ్ లు.. టీ20, వన్డేల్లోనూ ప్రయోగం!

Sis Grass: ఐపీఎల్‌ సీజన్ 17ను మరింత రసవత్తరంగా మార్చేందుకు బీసీసీఐ మరో ప్రయోగం సిద్ధమైంది. ఈ వారంలో జరిగే ఓ రెండు మ్యాచ్‌ల కోసం హైబ్రిడ్‌ పిచ్‌లు ప్రయోగించబోతుంది. ఈ టోర్నీలో 200కు పైగా భారీ స్కోర్లు నమోదవడంతోపాటు చేధించడంకూడా సులభంగా మారడంతో బౌలర్లు తేలిపోతున్నారు. ఈ క్రమంలోనే బ్యాటు, బాల్ కు మధ్య పోరును మరింత టఫ్ గా మార్చేందుకు ధర్మశాల వేదికగా హైబ్రిడ్‌ పిచ్‌లపై ఆడించనున్నారు.

బంతికి, బ్యాటుకి మధ్య సమతూకం కోసం..
ఈ మేరకు బ్యాటర్లు దంచికొడుతున్న నేపథ్యంలో బంతికి, బ్యాటుకి మధ్య సమతూకం కోసం సిస్‌గ్రాస్‌ (SisGrass) సంస్థ రూపొందిస్తున్న హైబ్రిడ్‌ పిచ్‌ (Hybrid Pitch)లు మంచి ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు. ఈ ట్రాక్‌లలో సహజసిద్ధమైన గడ్డితో పాటు 5శాతం పాలిమర్‌ కలిసి ఉంటుందని, దీనివల్ల బౌలర్లు స్థిరమైన బౌన్స్‌ రాబట్టొచ్చని వెల్లడించారు. అంతేకాదు పిచ్‌ కూడా చాలాసేపు తాజాగా ఉండటంతో బౌలర్లు కూడా సమర్థవంతంగా బంతులు వేయగలుగుతారని చెబుతున్నారు. యూనివర్సల్‌ అనే యంత్రం సాయంతో ఇప్పటికే ధర్మశాల స్టేడియంలో ఈ హైబ్రిడ్‌ ట్రాక్‌ పనులు మొదలుపెట్టగా ఈ రెండు మ్యాచ్‌ల్లో వచ్చే ఫలితాలను బట్టి భవిష్యత్తులోనూ ఇలాంటి ట్రాక్‌లను తయారు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: T20 WC 2024: వరల్డ్ కప్‌ టోర్నీకి ఉగ్ర ముప్పు.. ఆ దేశం నుంచి బెదిరింపులు!

పంజాబ్‌ కింగ్స్‌ మే 9న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఈ హైబ్రిడ్‌ పిచ్‌లపై ఆడబోతోంది. ఐసీసీ కూడా ఇప్పటికే టీ20, వన్డేల్లో హైబ్రిడ్‌ పిచ్‌ల వాడకానికి ఆమోదం తెలపడంతో త్వరలో అంతర్జాతీయస్థాయిలోనూ ఈ పిచ్‌లపై మ్యాచ్‌లు జరిగే అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్‌లో హైబ్రిడ్‌ పిచ్‌లపై టీ20, వన్డే మ్యాచ్‌లే కాదు నాలుగు రోజుల కౌంటీ మ్యాచ్‌లు ఆడటం విశేషం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు