Husband killed his Wife with Knife: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో దారుణం చోటు చుకుంది. జిల్లాలోని ఆకివీడుకు చెందిన సంధ్య రాణి, రాంబాబు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది అయితే వీరి మధ్య గత కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో కోర్టుకు వెళ్లి వీరు విడాకులు కూడా తీసుకున్నారు. భర్త రాంబాబును వదిలేసి సంధ్య రాణి తల్లితండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే శనివారం గుడికి వెళ్లి వస్తోన్న భార్య సంధ్యను వెనుక నుండి వచ్చిన భర్త రాంబాబు చాకుతో పీకపై కోశాడు. ఆ తర్వాత రెండు మూడు సార్లు సంధ్య రాణిపై దాడి చేశాడు. ఈ ఘటనలో సంధ్య రాణి రోడ్డుపైనే మృతి చెందింది. భార్యను హత్య చేసిన అనంతరం రాంబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Husband killed his Wife with Knife: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త

Husband killed his Wife with Knife at akividu in West Godavari District: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో దారుణం చోటు చుకుంది. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత మార్చాడు భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఆకివీడుకు చెందిన సంధ్య రాణి, రాంబాబు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది అయితే వీరి మధ్య గత కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో కోర్టుకు వెళ్లి వీరు విడాకులు కూడా తీసుకున్నారు. భర్త రాంబాబును వదిలేసి సంధ్య రాణి తల్లితండ్రుల వద్ద ఉంటోంది.

ఈ క్రమంలోనే శనివారం గుడికి వెళ్లి వస్తోన్న భార్య సంధ్యను వెనుక నుండి వచ్చిన భర్త రాంబాబు చాకుతో పీకపై కోశాడు. ఆ తర్వాత రెండు మూడు సార్లు సంధ్య రాణిపై దాడి చేశాడు. ఈ ఘటనలో సంధ్య రాణి రోడ్డుపైనే మృతి చెందింది. భార్యను హత్య చేసిన అనంతరం రాంబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం నిందితుడు రాంబాబుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న రాంబాబు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా సంధ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడుని పట్టుకోనిదే మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు రాంబాబు పట్టుకుని హత్య చేయాలని కోరుతూ.. మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. అనంతరం సంధ్య రాణి డెడ్ బాడీని పోలీసులు.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంధ్య మరణం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

Advertisment
తాజా కథనాలు