Crime : భార్య తల నరికి.. పోలీస్‌స్టేషన్‌కు బంతిలా పట్టుకొచ్చాడు.. ఎందుకు చంపాడో తెలుసా?

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమె తల నరికాడు భర్త. ఒడిశా-నయాగఢ్ జిల్లాలోని బనిగొచ్చాలో ఆ ఘటన జరిగింది. భార్య తల నరికేసిన తర్వాత ఆ తలను పట్టుకోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్త లొంగిపోయాడు.

New Update
Crime : భార్య తల నరికి.. పోలీస్‌స్టేషన్‌కు బంతిలా పట్టుకొచ్చాడు.. ఎందుకు చంపాడో తెలుసా?

Extra Marital Relations : ఇటీవలి కాలంలో మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతుంది. చంపడమే ఘోరం అనుకుంటే.. అందులోనూ పైశాచికంగా చంపడం మరింత దారుణం. ఏ సమస్యకైనా చంపడం, చావడం పరిష్కారం కాదు. తప్పులు చేశారని చంపుకుంటూ పోతే భూమ్మీద అసలు మనుషులే ఉండరు. పాపాలు చేసినా, ఘెరాలు చేసినా శిక్షించాల్సింది న్యాయస్థానాలే. పగలు, ప్రతీకారలతో బతకడం వల్ల జీవితమే నాశనం అవుతుంది. క్రూరంగా చంపడం, ముక్కలు ముక్కలగా నరకడం.. బాడీ పార్ట్స్‌ను కుక్కర్‌లో వేయడం, బ్యాగ్‌లో దాచుకోని బెడ్‌ కింద పెట్టుకోని పడుకోవడం.. అసలు ఇలాంటి ఆలోచనలు మనుషులకు ఎలా వస్తున్నాయో అర్థంకాని పరిస్థితి. ఒడిశాలో జరిగిన ఓ హత్య గురించి వింటే ఒళ్లు గగురుపోడవక మానదు.

వివాహేతర సంబంధమే కారణమా? అనుమానమా?
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల(Extra Marital Relations) చుట్టూనే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. ప్రజలు విచక్షణ కోల్పోయి మర్డర్లు చేస్తున్నారు. అటు లైఫ్‌ పార్టనెర్‌ను మోసం చేయకూడదన్న మోరల్‌ వ్యాల్యూస్‌ని మరుస్తున్నారు. ఇటు వివాహేతర సంబంధానికి హత్యే జస్టిస్‌ అని మరికొందరు తప్పుగా ఆలోచిస్తున్నారు. మరికొంతమంది తమ లవర్‌ లేదా లైఫ్‌ పార్టనెర్‌కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో చంపేస్తున్నారు. అనుమానంతో చంపడాలు, నరకడాలు చాలా కాలంగా సమాజంలో సర్వసాధారణమైపోయిన దారుణ స్థితికి అద్దం పడుతున్నాయి.

35 ఏళ్ల అర్జున్ బాఘా తన భార్యతో ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత బాఘా ఒడిశా-నయాగఢ్ జిల్లాలోని బనిగొచ్చా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. తన భార్య తలతో నరికి.. ఆ తలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చాడు. భార్యభర్తలు బిడపాజు గ్రామానికి చెందినవారు. తన భార్య ధరిత్రి (30) వివాహేతర సంబంధానికి పాల్పడినట్లు అనుమానించి భర్త బాఘా హత్య చేసినట్లు పోలీసులకు చెప్పారు.

Also Read: టీమిండియాకు సఫారీల సవాల్‌.. తొలి టీ20కు ప్లేయంగ్‌ టీమ్‌ ఇదే!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు