Husband Stabs Wife: భార్యపై కత్తెరతో 19 సార్లు దాడి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

లక్నోలో దారుణ ఘటన సీసీటీవీలో రికార్డయింది. లంబేకేశ్వర్ పార్కు సమీపంలో రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న భార్యపై కత్తెరతో 19సార్లు పొడిచాడు భర్త. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భార్యకు వివాహేతర సంబంధం అనుమానంతోనే భర్త ఇలా చేసినట్టు సమాచారం.

New Update
Husband Stabs Wife: భార్యపై కత్తెరతో 19 సార్లు దాడి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

మనుషుల్లో క్రూరత్వం రోజురోజుకు పెరిగిపోతోంది. హింసనే దారిగా చేసుకోని ఆయుధాలతో విరుచుకుపడుతున్నారు. ఏ సమస్యకైనా తన్నుకోవడాలు, పొడుచుకోవడాలు పరిష్కారం కావు. ఈ విషయం తెలిసి కూడా ఆవేశంతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ఈ తరహా ఘటను ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరోసారి అదే జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యపై 19 సార్లు కత్తెరతో దాడి చేశాడు. ఇదంతా సీసీటీవీ వీడియోలో రికార్డైంది. నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Viewers discretion is advised

అందరూ చూస్తుండగానే:
ఈ ఘటన లక్నో(Lucknow)లో చోటుచేసుకుంది. నిందితుడి పేరు బ్రిజ్‌మోహన్‌ నిషాద్‌. గాయపడిన మహిళ పేరు సునమ్‌. కుతుబ్‌పూర్ ప్రాంతంలోని లంబేకేశ్వర్ పార్కు సమీపంలో సునమ్‌ కూరగాయలు కొంటున్నాడు. అంతలోనే అక్కడికి వచ్చిన బ్రిజ్మోహన్ సునమ్‌పై కత్తెరతో దాడి చేశాడు. క్షణాల్లో సునమ్‌పై బ్రిజ్‌మోహన్‌ 19 సార్లు కత్తెరతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పట్టపగలు జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. దాడి తర్వాత సునమ్‌ గాయపడి కిందపడిపోయాడు. సమాచారం అందుకున్న సునమ్‌ కుమారుడు రాహుల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తండ్రిపై ఫిర్యాదు చేశాడు. రాహుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు బ్రిజ్మోహన్‌పై సెక్షన్ 324, 342 కింద కేసు నమోదు చేశారు. బ్రిజ్‌మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేజీఎంయూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమన్ పరిస్థితి నిలకడగా ఉంది. కానీ, సునమ్‌ శరీరంపై చాలా గాయాలున్నాయి.

ఎందుకిలా చేశాడు?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సునమ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు బ్రిజ్మోనా అనుమానించాడు. దీంతో ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా సుమన్‌పై బ్రిజ్‌మోహన్‌ దాడి చేశారని రాహుల్‌ అన్నారు. ఈ వ్యవహారంపై డిసెంబర్‌లో బ్రిజ్‌మోహన్‌పై ఫిర్యాదు చేశారు. 'ఫ్రీ ప్రెస్ జర్నల్' ఈ విషయాన్ని నివేదించింది.

Also Read: 5 మ్యాచ్‌ల్లో నాలుగు గుడ్లు పెట్టిన కెప్టెన్‌.. ఇలాగైతే కష్టమే!

WATCH:

Advertisment
తాజా కథనాలు